»   » అక్కినేని పుట్టిన రోజే నాగ చైతన్య లాంచింగ్ డేట్

అక్కినేని పుట్టిన రోజే నాగ చైతన్య లాంచింగ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Naga Chaitanya
నాగార్జున కుమారుడు నాగ చైతన్య లాంచింగ్ డేటు ఫిక్సయింది. అతని తాతగారైన అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం అయిన సెప్టెంబర్ 20 న భారీ ఎత్తున సినిమా ప్రారంభింస్తారని తెలుస్తోంది. దానిని గ్రాండ్ గా నిర్వహించాలని నాగార్జున భావిస్తున్నారు. దానికోసం ఆ రోజు ఆయన అభిమానులందరినీ రప్పించనున్నారని తెలుస్తోంది. ఆయన్ని ఆదరించినట్లుగానే కుమారుడునీ ఆదరించాలని ఆయన అక్కడ కోరనున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి వాసు వర్మ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించనున్నాడు. అతను గత రెండు సంవత్సరాలుగా స్క్రిప్టు వండుతున్నారని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని ప్రెస్టేజ్ ఇస్యూ గా భావించి పెద్ద హిట్ కొట్టాలని యోచిస్తున్నారు. అందుకోసం కెమెరామెన్ గా సమీర్ రెడ్డిని మంచి రెమ్యునేషన్ ఇచ్చి మరీ పెట్టుకుంటున్నారు. సంగీతం ఎ.ఆర్.రహమాన్ గానీ దేవీశ్రీ ప్రసాద్ గానీ అందిస్తారని అంటున్నారు. అంటే నాగ చైతన్య లాంచింగ్ సినిమా నాగార్జున మేనల్లుడు లాంచింగ్ ఫిల్మ్ 'కాళిదాసు' లా తేలిపోకూడదని ప్లాన్ చేస్తున్నారుట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X