»   » నాగ చైతన్య-హన్సిక జంటగా సినిమా

నాగ చైతన్య-హన్సిక జంటగా సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అక్కినేని యువ హీరో నాగ చైతన్య, హన్సిక జంటగా సినిమా తెరకెక్కబోతోంది. ఇంతకు ముందు నాగార్జునతో 'డమరుకం' చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీనివాసరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. నిర్మాత సి. కళ్యాణ్ శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

 Naga Chaitanya, Hansika

ఈ సినిమా గురించి సి. కళ్యాణ్ మాట్లాడుతూ...'నాగ చైతన్య హీరోగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకంపై రూపొందనున్న ఈ భారీ చిత్రం సెప్టెంబరులో ప్రారంభమవుతుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగే భారీ షెడ్యూల్ లో ఈ చిత్రం పూర్తవుతుంది. నాగ చైతన్య సరసన హన్సిక కథానాయికగా నటిస్తుంది' అని తెలిపారు.

ఈ చిత్రంలో బ్రహ్మానందం కీకల పాత్రలో నటించనున్నట్లు నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి ఆకుల శివ కథ అందించారు. అనూప్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. నాగ చైతన్య కెరీర్లో మంచి కమర్షియల్ హిట్ సాధించేలా సినిమాను తెరకెక్కిస్తామని నిర్మాత తెలిపారు. నాగ చైతన్య, హన్సిక జంటగా నటిస్తున్న ఈచిత్రానికి కథ-మాటలు : ఆకుల శివ, సంగీతం : అనూప్ రూబెన్స్, సమర్పణ : సి. కళ్యాణ్, నిర్మాతలు : వరుణ్, తేజ, స్క్రీన్ ప్లే-దర్శకత్వం : శ్రీనివాసరెడ్డి.

English summary
Akkineni Naga Chaitanya is going to pair up with actress Hansika for a new movie. Srinivasa Reddy will direct this movie and C.Kalyan will be the producer. Music will be scored by Anoop Rubens.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu