»   » నాగచైతన్య సాంగ్ మేకింగ్ లాంచ్ చేసాడు (వీడియో)

నాగచైతన్య సాంగ్ మేకింగ్ లాంచ్ చేసాడు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నిఖిల్‌, నందిత, అంజలి ప్రధాన పాత్రల్లో ఉదయ్‌ నందనవనం దర్శకత్వం వహించిన చిత్రం 'శంకరాభరణం'. ఈ చిత్రం సాంగ్ మేకింగ్ వీడియోను ఈ రోజు సాయింత్రం మరో యువ హీరో నాగ చైతన్య లాంచ్ చేసారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ కోన వెంకట్ ట్వీట్ చేసారు. ఇక్కడ ఆ ట్వీట్, వీడియో చూడండి.


నిఖిల్‌, నందితలు జంటగా నటించిన చిత్రం 'శంకరాభరణం'. ఈ చిత్రం ఆడియో రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓ హిందీ చిత్రం రీమేక్ అంటూ కోన వెంకట్ తెలియచేసారు.

కథ ఎమిటంటే , హీరో నిఖిల్ ఎన్.ఆర్.ఐ, తనకు సంబందిచిన భూమిని విడిపించుకోవాలని వస్తాడు. ఎలా విడిపించుకున్నడన్నదే కథ. ఒరిజినాలిటి మిస్ కాకుడదని బీహర్ లో చిత్రికరించారు.

2010 లో విడుదలైన చిన్న సినిమా ఫస్ గయ రే ఒబామా అనే హిందీ చిత్రం అదారంగా తిసిన చిత్రం, దీనికి సంబందించిన సౌత్ రైట్స్ మోత్తం తీసుకున్నట్టు కొన వెంకట్ తెలియజేసారు. కోన వెంకట్‌ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మాత. అంజలి ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రను పోషించారు. నిఖిల్‌, నందిత, అంజలిలతోపాటు సుమన్‌, సితార, రావు రమేష్‌, సప్తగిరి, సత్యం రాజేష్‌ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.

Naga Chaitanya lauched theme song of SHANKARABHARANAM

మరో ప్రక్క ఈ చిత్రాన్ని కేరళలోనూ విడుదల చేయనున్నట్లు నిర్మాత కోన వెంకట్‌ ప్రకటించారు. నోబెల్‌ ఆండ్రే ప్రొడక్షన్స్‌ సహకారంతో కేరళలో మొత్తం 30 సెంటర్లలో శంకరాభరణం విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. క్రైమ్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం అందించారు.

ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, రచనాసహకారం: వెంకటేశ్ కిలారు, భవానీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి, సహనిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరావ్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్.

English summary
Today Evening Naga Chaitna launched theme song of SHANKARABHARANAM.
Please Wait while comments are loading...