»   » ఎన్టీఆర్ కూడా ఒప్పుకున్నాడని నాగచైతన్య

ఎన్టీఆర్ కూడా ఒప్పుకున్నాడని నాగచైతన్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

అవకాశం వస్తే తారక్ (ఎన్టీఆర్), నేను 'గుండమ్మ కథ" రీమేక్‌లో నటించాలనుకుంటున్నాం అని మరో సారి స్పష్టం చేసారు నాగచైతన్య. ఆయన తన తాజా చిత్రం దడ ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెళ్లడించారు.అంటే ఎన్టీఆర్ కూడా దీనికి సముఖంగానే ఉన్నట్లు అతని మాటల్లో అందరూ అర్దం చేసుకున్నారు.అయితే దీనికి సంభందించిన గ్రౌండ్ వర్క్ ఏదైనా జరుగుతోందా అనే సందేహం చాలా మందికి కలిగింది. ఇంతకుముందు కూడా గుండమ్మ పాత్ర వేసే స్టామినా ఉన్న వ్యక్తి దొరికితే వెంటనే సెట్స్ కి వెళ్ళిపోతుందని చెప్పారు.అలాగే ఈచిత్రాన్ని కాంటపరరీగా చేసి స్క్రిప్టుని మార్చి రాసి ఏ దర్శకుడు చేత డైరక్ట్ చేయిస్తే బాగుంటుందని ఆలోచనలో ఉన్నారు. అయితే ఎన్టీఆర్ తన ఆప్షన్ గా వివి వినాయిక్ ని ప్రపోజ్ చేసినట్లు సమాచారం.

ఇక ప్రస్తుతం నాగచైతన్య తన దడ చిత్రం ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చేస్తున్న 'బెజవాడ రౌడీలు" 45 శాతం పూర్తయ్యింది. దేవా కట్టా దర్శకత్వంలో చేయబోతున్న 'ఆటోనగర్ సూర్య" ఆక్టోబర్ మొదటి వారంలో ఆరంభం అవుతుంది.అలాగే ఎన్టీఆర్ కూడా సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఊసరవిల్లి చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరో ప్రక్క బోయపాటి శీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్టుని ప్లాన్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు.అంటే వీరు ఉత్సాహం చూపించినా ఇప్పుడిప్పుడే గుండమ్మ కథ చేయటానికి టైమ్ రాదన్నమాట.

English summary
Jr NTR and Naga Chaintanya, the youngsters from the legendary families are all set to team up for a film. They are willing to do the remake of yesteryears classic ‘Gundamma Katha’. Both of them are ready to do the film and are looking for a director who could handle the film well.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu