twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టికెట్ రేట్ల మీద నాకెలాంటి ఇబ్బంది లేదన్న నాగార్జున.. అసలు విషయం బయటపెట్టిన నాగచైతన్య

    |

    కొద్ది రోజుల క్రితం జరిగిన బంగార్రాజు సినిమా ఈవెంట్ లో నాగార్జున చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో వారికే కాక చాలా మందికి కోపం తెప్పించాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సినిమా టికెట్ రేట్లు విషయంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదు అని కామెంట్ చేయడంతో చాలా మంది దాన్ని తప్పు పట్టారు. అయితే తన తండ్రి ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు కారణాన్ని నాగచైతన్య కూడా వెల్లడించారు. వివరాల్లోకి వెళితే

    ఇద్దరూ హీరోలే

    ఇద్దరూ హీరోలే

    చివరిగా నాగార్జున వైల్డ్ డాగ్ అరే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు, ఆ సినిమా సూపర్ హిట్ అని అనిపించుకోక పోయినా మంచి టాక్ అయితే తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత నాగార్జున హీరోగా నాగచైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా బంగార్రాజు. ముందు నుంచి కూడా ఈ సినిమాలో నాగార్జున హీరోగా నాగచైతన్య ది అతిథి పాత్ర అని అందరూ భావించారు. కానీ ఇటీవల ప్రమోషన్స్ లో మాత్రం సినిమాలో ఇద్దరిదీ ప్రధాన పాత్రే అని, ఇద్దరూ హీరోలే అని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ వెల్లడించారు.

     14వ తేదీన ప్రేక్షకుల ముందుకు

    14వ తేదీన ప్రేక్షకుల ముందుకు


    నాగార్జు, నాగ చైతన్య కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్ లో నాగార్జున ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్ల తగ్గింపు వ్యవహారం గురించి మాట్లాడుతూ అసలు తనకు సినిమా రేట్ల తగ్గింపు వలన ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పుకొచ్చాడు.

    నాకు ఎలాంటి ఇబ్బంది లేదు

    నాకు ఎలాంటి ఇబ్బంది లేదు

    దీంతో నాగార్జున మీద సినీ పరిశ్రమకు చెందిన వారే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా కాస్త ట్రోల్ చేసిన పరిస్థితులు కనిపించాయి. నాగార్జున పాత వీడియోలు తెరమీదకు తీసుకు వచ్చి అప్పుడు అలా ఇప్పుడు ఇలా అందరూ ట్రోలింగ్ చేశారు. అయితే ఈ విషయం మీద ఇప్పుడు నాగచైతన్య క్లారిటీ ఇచ్చారు. తాజాగా ప్రమోషన్స్ లో ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఏపీ టికెట్ రేట్ల గురించి తాను స్పందించడానికి ఏమీ లేదని అన్నారు నేను ఒక నటుడిని మాత్రమే అని చెప్పుకొచ్చారు, నాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చిన ఆయన ముందుగానే నిర్మాతలను అడుగుతామని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంటేనే సినిమా చేస్తానని చెప్పుకొచ్చారు.

    తగ్గించిన రేట్ల ప్రకారం బడ్జెట్

    తగ్గించిన రేట్ల ప్రకారం బడ్జెట్

    అంతేకాక సినీ పరిశ్రమకు రేట్లను తగ్గిస్తూ తెచ్చిన జీవో ఏప్రిల్లో అందుబాటులోకి రాగా ఈ సినిమా ఆగస్టులో మొదలైందని ఆంధ్రప్రదేశ్ లో తగ్గించిన రేట్ల ప్రకారం మేము బడ్జెట్ వేసుకున్నాం కాబట్టి మా సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక తన సినిమా షూటింగ్స్ విషయం గురించి మాట్లాడుతూ విక్రమ్ కుమార్ దర్శకుడు గా తెరకెక్కుతున్న థాంక్యూ సినిమా ఇప్పటికే 85 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని ఈ నెల 25వ తారీఖున తాము విదేశాలకు వెళ్లి మిగతా షూటింగ్ పూర్తి చేసుకుంటామని చెప్పుకొచ్చారు.

    సినిమాల విషయానికి వస్తే

    సినిమాల విషయానికి వస్తే

    అమెజాన్ వెబ్ సిరీస్ కూడా ఒకటి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నానని, స్వతహాగా తనకు ఈ హారర్ ఫిలిమ్స్ అంటే భయం అని సినిమాలు చూసేటప్పుడు సౌండ్ జీరోలో పెట్టుకుని చూస్తా అని చెప్పుకొచ్చారు. పరశురామ్, మహేష్ బాబు సినిమా పూర్తి అయిన తర్వాత పరశురామ్ తో తన సినిమా ఉంటుందని చైతో వెల్లడించారు. నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడ తో ప్రస్తుతానికి ఒక స్క్రిప్ట్ నడుస్తోందని ఆ సినిమా ఇంకా ఖరారు కావాల్సి ఉందని చెప్పుకొచ్చారు.

    English summary
    Naga Chaitanya reveals nagarjuna's hope over ap tikets issue
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X