»   » నాగచైతన్య ‘దోచెయ్‌’ విడుదల తేదీ(అఫీషియల్)

నాగచైతన్య ‘దోచెయ్‌’ విడుదల తేదీ(అఫీషియల్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అక్కినేని నటవారసుడు నాగచైతన్య నటిస్తున్న చిత్రానికి ‘దోచెయ్‌' అనే టైటిల్‌ను ఖరారు చేసి పోస్టర్స్ వదిలిన సంగతి తెలిసిందే. ‘స్వామిరారా' ఫేం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. ఈ సందర్భంగా ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసారు. ఏప్రియల్ 17న చిత్రం రిలీజ్ కానుందని మీడియాకు తెలియచేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నిర్మాత మాట్లాడుతూ... ఇటీవల పీటర్ హెయిన్స్ నేతృత్వంలో నాగచైతన్యతో ఓ థ్రిల్లింగ్ ఛేజ్ ని చిత్రీకరించటం జరిగింది. ఆ ఛేజ్ చాలా ఎక్సట్రార్డనరీగా వచ్చింది. రెండు పాటలు సెట్స్ లోనూ, ఒక పాట బ్యాంకాక్ లోనూ తీసాం. దీంతో మా దోచేయ్ చిత్రం షూటింగ్ ఆల్రోస్ట్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సమ్మర్ స్పెషల్ గా ఏప్రియల్ 17 న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తాం అన్నారు.

Naga Chaitanya’s Dochey release on April 17th

ఈ చిత్రంలో చైతన్య ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలో కనిపిస్తాడని చెప్తున్నారు. మోసం చేసేవారిని ఘరానా మోసంతో దెబ్బకొట్టే యువకుడి పాత్రలో నాగచైతన్య నటిస్తున్నాడు. చైతన్య సరసన కృతిసనాన్‌ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రే.లి. పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

''ప్రతి మోసం వెనుక ఇద్దరుంటారు. ఒకరు మోసం చేసేవాడు. మోసపోయేవాడు. నువ్వు రెండో వాడు కాకుండా ఉండాలంటే, మొదటివాడివి అయ్యితీరాల్సిందే..'' ఈ అంశం చుట్టూ తిరిగే కథే మా చిత్రం అంటున్నారు సుధీర్‌ వర్మ.

Naga Chaitanya’s Dochey release on April 17th

ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణముర ళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌., ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌., ఆర్ట్‌: నారాయణరెడ్డి., కో-ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు., నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌., కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సుధీర్‌వర్మ.

English summary
Naga Chaitanya’s next film tentatively titled Dochey will hit the big-screens on April 17th. Naga Chaitanya will be seen as conman in this stylish action entertainer. Kriti Sanon is cast opposite Naga Chaitanya in the film, taking shape in Sudheer Varma direction
Please Wait while comments are loading...