»   » జూ ఎన్టీఆర్ 'బృందావనం' లో సెకెండ్ హీరోయిన్ ఆమే!?

జూ ఎన్టీఆర్ 'బృందావనం' లో సెకెండ్ హీరోయిన్ ఆమే!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి (మున్నా ఫేమ్) దర్శకత్వంలో రూపొందుతున్న 'బృందావనం' చిత్రంలో మరో హీరోయిన్ ఎంపిక పూర్తయింది. నాగచైతన్య, గౌతం మీనన్ కాంబినేషన్ లో వస్తున్న 'ఏం మాయ చేసావో' చిత్రంతో పరిచయమవుతున్న సమంతా ఈ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా ఎంపికైంది. ఆమె తమిళంలో అంతకుముందు ఓ సినిమా చేసింది. అలాగే మోడల్ గాను కొన్ని బ్రాండులకు పనిచేసింది. ఇక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తయారవుతున్న బృందావనంలో కాజల్ మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది. ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తమన్ ఇంతకు ముందు జయీభవ, కిక్ చిత్రాలకు సంగీతం అందించారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu