»   »  అదిరింది కదూ...: నాగచైతన్య కొత్త సినిమాలో స్టిల్ ఇదిగో..

అదిరింది కదూ...: నాగచైతన్య కొత్త సినిమాలో స్టిల్ ఇదిగో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హిట్ కోసం మళ్లీ గౌతమ్ మీనన్ దగ్గరకు చేరాడు నాగచైతన్య. ఆయన దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ జానర్ లో చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో నాగచైతన్య ఎలా ఉండబోతున్నాడు అనేది ఆసక్తికరం. అందుకే...ఫ్యాన్స్ కోసం ఇందులో ఫొటోని విడుదల చేసారు..ఆ ఫొటోను మీరు చూడండి.

Chaitu looking dashing in his next film with Gautam Menon!

Posted by Annapurna Studios on 10 June 2015

అలాగే...ఏమాయ చేశావే సినిమా తరహాలోనే తెలుగులో నాగచైతన్య, తమిళంలో శింబు హీరోలుగా ఏకకాలంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇక రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు రచయిత కోన వెంకట్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు... శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి.. మరో స్టిల్ ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే...

Akkineni Naga Chaitanya from Gautam Menon's film!

Posted by Annapurna Studios on 8 June 2015

హీరోహీరోయిన్స్ నాగచైతన్య, మంజిమా మోహన్ బైక్ పై చక్కర్లు కొడుతుండగా.. క్లిక్ మన్న ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. ఇక సమంత మినహా దాదాపుగా ఏమాయ చేశావే టీమ్ మొత్తం.. ఈ సినిమాకు రీపీట్ అవుతుండగా.. మరోసారి లవ్ స్టోరీతోనే మ్యాజిక్ చేసే పయత్నంలో ఉన్నాడట గౌతమ్ మీనన్... హైవే జర్నీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. నదియా, బాబాసెహగల్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Naga Chaitanya's looking dashing in his next film with Gautam Menon!

ఇప్పటికే సగానికిపైగా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం బెంగుళూరు సమీపంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ.. తర్వాతి షెడ్యూల్ కోసం హైదరాబాద్ షిప్ట్ అవనుంది. వినాయకచవితి సందర్భగా ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.... మరి... ఈ సినిమాతో ఏమాయ చేశావే మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందేమో చూద్దాంమని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

English summary
Naga Chaitanya happy to work with Goutham Menon again. here is the dashing look from that film.
Please Wait while comments are loading...