»   » నాగ చైతన్య ‘ప్రేమమ్’ ఫస్ట్ లుక్ (ఫోటో)

నాగ చైతన్య ‘ప్రేమమ్’ ఫస్ట్ లుక్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హైదరాబాద్: మళయాలంలో సూపర్ హిట్టయిన ‘ప్రేమమ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య, శృతి హాసన్ ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చైతూ కెరీర్లో 12వ సినిమా ఇది. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని ‘ప్రేమమ్' పేరుతోనే రీమేక్ చేస్తున్నారు. తాజాగా ఫస్ట్ లుక్ రిలీజైంది.

Naga Chaitanya's Premam first look

గతంలో నాగార్జున హీరోగా ‘మజ్ను' అనే సినిమా వచ్చింది. ‘ప్రేమమ్' రీమేక్ చిత్రం కూడా లవ్ స్టోరీ కావడంతో ఈ చిత్రానికి ‘మజ్ను' అనే టైటిల్ బాగా సూటవుతుందని భావించారు. కానీ ఫైనల్ గా ‘ప్రేమమ్' టైటిల్ ఖరారు చేసారు. ఈ చిత్రంలో శృతి హాసన్ తో పాటు, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ కూడా నటిస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా ఒరిజినల్ వెర్షన్ ప్రేమమ్ చిత్రంలో నటించిన వారు. మళయాలం ప్రేమంలో లెక్చరర్ పాత్ర పోషించి సాయి పల్లవి స్థానంలో శృతి హాసన్ నటిస్తోంది. సినిమాలో హృతి హాసన్ రోల్ కీలకంగా, ఎక్కువగా నిడివితో ఉంటుంది. మిగతా ఇద్దరివీ పరిమితమైన పాత్రలే.

Naga Chaitanya's Premam first look

ఆల్రెడీ మలయాళంలో రిలీజైన్ ‘ప్రేమమ్' చిత్రం సూపర్ హిట్టయింది. మళయాలం సినిమా అయినప్పటికీ తమిళం, తెలుగు, కన్నడ యూత్ ఆల్రెడీ ఈ చిత్రాన్ని చూసేసారు. బాషతో సంబంధం లేకుండా సినిమా అందరికీ అర్థం అయ్యేలా మంచి ఫీల్ తో ఉండటమే అందుకు కారణం. సినిమాలో నవీన్ పాలీ పెర్ఫార్మెన్స్ హైలెట్..... తెలుగులో నాగ చైత్య కూడా అదే రేంజిలో చేస్తే సినిమా హిట్టవడం ఖాయం.

English summary
Naga Chaitanya's Premam first look released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu