For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగచైతన్య 'సాహ‌సం శ్వాస‌గా సాగిపో'‌ టాక్ ? స్టోరీ లైన్ ఏంటి?

  By Srikanya
  |

  హైదరాబాద్: నాగ చైతన్య, గౌతం మీనన్, ఏఆర్ రెహమాన్ కాంబినేసన్లో అప్పట్లో వచ్చిన 'ఏ మాయ చేసావే' చిత్రం అప్పట్లో క్లాసికల్ హిట్ గా నిలిచి పోయింది. తాజాగe ఈ ముగ్గురి కాంబినేషన్ మరోసారి రిపీట్ చేస్తూ 'సాహసం శ్వాసగా సాగిపో' ఈ రోజు విడుదలైంది.

  యు/ ఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్ర రన్ టైం 139 నిముషాలు , అంటే రెండు గంటల పందొమ్మిది నిముషాలు . ఈ మధ్య కాలం లో ప్రేక్షకుల కూడా నిడివి ఎక్కువ గా ఉంటె సినిమా చూడానికి ఇష్టపడం లేదు. ఈ నేపథ్యం లో ఆయా చిత్ర దర్శక , నిర్మాతలు నిడివి తక్కువ ఉండేలా చూసుకుంటున్నారు. గౌతమ్ మీనన్ కూడా ఇదే ప్లాన్ చేసి అక్కినేని అభిమానులకు ఆనందం కలిగించాడు. కానీ సినిమా అనుకున్నంత కిక్ ఇవ్వలేదని సమాచారం.

  గతేడాది డిసెంబర్‌లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి ఈ రోజు (నవంబర్ 11న) భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఇక ఇప్పటికే ట్రైలర్, ఆడియోలతో విపరీతమైన ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సందర్బంగా చిత్రం కథేంటి, ఇప్పటికే కొన్ని చోట్ల షోలు పడ్డాయి..టాక్ ఏంటి అనే విషయాలు క్రింద చూద్దాం.

  అలా మొదలైంది

  అలా మొదలైంది

  నాగచైతన్య , అతని సోదరి కలిసి కాలేజ్ కు వెళ్తూంటాడు. అతని సోదరి స్నేహితురాలు లీల (మంజిమ మోహన్) వీళ్లతో కలుస్తుంది. ఆమె అసెస్టెంట్ డైరక్టర్ గా కావాలని వారి ఇంటికి వస్తుంది.

  ట్రిప్ లో ఫన్, పాటలు

  ట్రిప్ లో ఫన్, పాటలు

  టిపికల్ గౌతమ్ మీనన్ లవ్ స్టోరీలా కథ నడుస్తూండగా..ఓ రోజు..ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నాగచైతన్య , లీల కలిసి వైజాగ్ నుంచి కన్యాకుమారి బైక్ ట్రిప్ కు బయిలుదేరతారు.ఈ ట్రిప్ లో పూర్తిగా చైతూ ఆమెతో ప్రేమలో పడతాడు. మధ్య మద్యలో ఫన్ తో నడుస్తుంది.

  ఇంట్రస్టింగ్

  ఇంట్రస్టింగ్

  ఇక అక్కడ నుంచి కథ చాలా స్లోగా , బిట్ సాంగ్స్ తో కదులుతుంది. అలాగే ఈ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ వెళ్లిపోమాకే కూడా వస్తుంది.ఈ పాట సినిమాలో ఓ ఇంట్రస్టింగ్ ట్విస్ట్ తో వస్తుంది. ఈ సాంగ్ లో అద్బుతమైన లొకేషన్స్ చూపెట్టారు. అలాగే సినిమాటోగ్రఫి కూడా అదిరింది.

  విలన్స్ ఎట్రీ ఇచ్చారు

  విలన్స్ ఎట్రీ ఇచ్చారు

  ఇక ఇక్కడ నుంచి క్రైమ్ సీక్వెన్స్ మొదలైంది. ప్రీ ఇంట్రవెల్ సీన్స్ కాస్త సహనానికి పరీక్షగానే అనిపించాయి. హీరోయిన్ మిస్సవటం ..అలా నాగచైతన్య నిశ్సహాయిత మీద ట్విస్ట్ ఇచ్చారు. ఫస్టాఫ్ స్లోగా, ఎంటర్టైన్మెంట్ అనేది పెద్దగా లేకుండా సాగింది.

  పూర్తిగా అదే

  పూర్తిగా అదే

  సెకండాఫ్ పూర్తిగా క్రైమ్ కథతో నడుస్తుంది. యాక్షన్ న్ ఎపిసోడ్స్ తో పూర్తిగా సినిమాని గౌతమ్ మీనన్ నింపేసారు. అయితే సెకండాఫ్ కూడా అలాగే స్లో నేరేషన్ తో నడిచింది. ఇంట్రస్ట్ పుడుతుంది అనేటప్పుడికే కిల్ చేసేసారు.

  నాగ చైతన్య మాట్లాడుతూ...

  నాగ చైతన్య మాట్లాడుతూ...

  మన పక్కింటి అబ్బాయిలాంటి పాత్రే. 'ఏ మాయ చేసావె' సినిమా చూశారు కదా. ఆ సినిమాకి ఇది కొనసాగింపులా ఉంటుంది. ఓ కుర్రాడి ప్రేమకథలో వచ్చిన సమస్య, దాన్ని తీర్చుకోవడానికి ఏం చేశాడన్నది కథ. తొలి సగం ప్రేమకథ, ద్వితీయార్ధంలో యాక్షన్‌ కనిపిస్తాయి అని నాగచైతన్య అన్నారు.

  డైరక్టర్ తో కొంచెం ఇబ్బందినే

  డైరక్టర్ తో కొంచెం ఇబ్బందినే

  'ఏం మాయ చేశావె' తరవాత నేను ప్రేమకథలకు సరిపోతానన్న నమ్మకం కలిగింది. ఈ సినిమాతో యాక్షన్‌ కథలూ చేయగలనని నిరూపించుకొంటా. గౌతమ్‌ సర్‌ని తొలి సినిమాలో కొంచెం ఇబ్బందిపెట్టుంటా (నవ్వుతూ). ఈసారి ఆడుతూ పాడుతూ పనిచేశాం అని చైతూ అన్నారు.

  అందుకే ఆ రెండూ ఫ్లాఫ్ అయ్యాయి

  అందుకే ఆ రెండూ ఫ్లాఫ్ అయ్యాయి

  'దడ', 'ఆటోనగర్‌ సూర్య' అంటూ యాక్షన్‌ ఇమేజ్‌ తెచ్చుకోవడానికి ప్రయత్నించారు కదా? అని నాగచైతన్యని ప్రశ్నిస్తే... అప్పటికి నా అనుభవం సరిపోలేదేమో? పైగా నన్ను యాక్షన్‌ కథల్లో చూడ్డానికి ప్రేక్షకులూ సిద్ధంగా లేరేమో అనిపించింది. అందుకే సరైన ఫలితాలు రాలేదు. యాక్షన్‌ కథల్ని ఎంచుకొన్నా... అందులో సహజత్వం ఉండేలా జాగ్రత్త పడితే మంచి ఫలితాలు వస్తాయి. 'సాహసం..'లో అదే చేశాం అని నాగచైతన్య అన్నారు.

  ఎక్సటెన్షన్ లాగ..

  ఎక్సటెన్షన్ లాగ..

  సాహసం శ్వాసగా సాగిపో అనే ఓ కుర్రాడు రెండు వేర్వేరు పరిస్థితుల్లో ఎలా ఉంటాడోనని చూపిస్తుంది. ఫస్టాఫ్ అంతా ఏ మాయ చేసావే సినిమాకు ఎక్స్‌టెన్షన్‌గా కనపడుతుంది. ఇక సెకండాఫ్ ఘర్షణ స్టయిల్లో సస్పెన్స్ థ్రిల్లింగ్‌గా సాగుతుంది. టైటిల్ జస్టిఫికేషన్‌. కుర్రాడు తను ప్రేమించిన అమ్మాయికి ఓ సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య నుండి ఆ అమ్మాయిని కాపాడటానికి ఎలాంటి సాహసం చేశాడనేదే కథ. అందువల్లే ఈ సినిమాకు సాహసం శ్వాసగా సాగిపో అనే టైటిల్ పెట్టారు అని నాగచైతన్య వివరించారు.

  క్యారక్టర్స్ తో పాటే ట్రావెల్

  క్యారక్టర్స్ తో పాటే ట్రావెల్

  దర్శకుడు గౌతమ్‌మీనన్ ప్రతి క్యారెక్టర్‌ను చాలా బాగా డిజైన్ చేస్తారు. ఇందులో క్యారెక్టర్స్‌ను చూస్తున్నప్పుడు ఆడియెన్స్ క్యారెక్టర్‌తో పాటు ట్రావెల్ చేస్తారు కాబట్టి, ఫస్టాఫ్ లవ్ స్టోరీ, సెకండాఫ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉంటుంది కాబట్టి అందరూ కనెక్ట్ అవుతారు. ఏమాయ చేసావె తర్వాత ఆడియెన్స్ నున్న లవ్‌స్టోరీస్‌లో యాక్సెప్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత ఆడియెన్స్ నన్ను యాక్షన్ జోనర్ సినిమాలకు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అలా కొత్తగా ప్రెజెంట్ చేశారు అని చెప్పుకొచ్చారు చైతూ.

  మెచ్యూరిటి అప్పటికి రాలేదు

  మెచ్యూరిటి అప్పటికి రాలేదు

  ఇప్పటి వరకు చేయని బాడీ లాంగ్వేజ్‌తో, నేచురల్ యాక్షన్ పార్ట్‌తో సినిమా సాగుతుంది. కెరర్ బిగినింగ్‌లో నేను యాక్షన్ సినిమాలు చేసిన యాక్షన్ సినిమాల స్క్రిప్ట్స్ సెలక్షన్ చేసేంత మెచ్యురిటీ రాలేదేమో కాబట్టి అనుకున్నంత హిట్ కాలేకపోయాయి. అయితే ఇప్పుడు నటుడుగా కొంత నేర్చుకున్నాను. అలాగే గౌతమ్‌గారు ఆయన సినిమాలో క్యారెక్టర్స్‌ను కన్విన్సింగ్‌గా చూపిస్తారు. కాబట్టి కాన్ఫిడెంట్‌గా ఒప్పుకున్నాను. నేను చేసే సినిమాల్లో రియలిస్టిక్ స్టోరీస్ ఉండాలని కోరుకుంటాను.

  టెన్షన్ అయితే లేదు

  టెన్షన్ అయితే లేదు

  సినిమాను గతేడాది డిసెంబర్‌లో విడుదల చేద్దామని అనుకున్నాం. కానీ రెండు లాంగ్వేజస్‌లో షూటింగ్ చేయడం కారణం ఒకటైతే, మంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేయడం వల్ల సినిమా ఇంత ఆలస్యమైంది. అయితే ఆలస్యమైందని ఏ టెన్షన్ లేదు. ప్రేమమ్ కంటే ముందుగానే సాహసం శ్వాసగా సాగిపో సినిమా రిలీజ్ కావాల్సింది అని చైతన్య అన్నారు.

  మ్యాజిక్ ఉంటుందా

  ''గౌతమ్‌ మేనన్‌ సినిమాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఆయన సినిమాల్లో కనిపించే మ్యాజిక్‌... ఇందులోనూ ఉంటుంది'' అంటున్నాడు చైతూ. ఈ సి నిమాకు చెందిన ఇంకో ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడండి.

  ప్రేమమ్ కంటే ముందే రావాలి

  ప్రేమమ్ కంటే ముందే రావాలి

  గతేడాది డిసెంబరులో రావాల్సిన సినిమా ఇది. త్వరగా వస్తే బాగుణ్ను' అని చాలాసార్లు అనిపించింది. నిజానికి 'ప్రేమమ్‌' కంటే ముందు రావాల్సిన సినిమా ఇది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కడం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. రెండు చోట్లా ఒకేసారి విడుదల చేద్దామనుకొన్నాం. అక్కడ మంచి డేట్‌ కుదిరితే, ఇక్కడ కుదిరేది కాదు. అయితే ఆ ప్రభావం సినిమాపై ఏమీ ఉండదు. ఎప్పుడు చూసినా ఓ ఫ్రెష్‌ లుక్‌ కనిపించే కథ ఇది అని నాగచైతన్య అన్నారు.

  ఈ సినిమాకు పనిచేసినవాళ్లు

  ఈ సినిమాకు పనిచేసినవాళ్లు

  బ్యానర్: ద్వారకా క్రియేషన్స్‌
  నటీనటులు: నాగచైతన్య, మంజిమ మోహన్ తదితరులు.
  సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌,
  సినిమాటోగ్రఫీ: డాన్‌మాక్‌ ఆర్థర్‌,
  ఎడిటింగ్‌: ఆంటోని,
  ఆర్ట్‌: రాజీవన్‌,
  ఫైట్స్‌: సిల్వ,
  రచన: కోన వెంకట్‌,
  నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి,
  కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ మీనన్‌.
  విడుదల తేదీ:11, నవంబర్ 2016.

  English summary
  Naga Chaitanya’s most anticipated movie Sahasam Swasaga sagipo is all set to come to the audience. Accumulating tremendous hype and curiosity as Naga Chaitanya is once again collaborating with Gautham Menon, sahasam swasaga sagipo is romantic thriller film. Expectations on Sahasam swasaga sagipo Box Office Collection are skyrocketing.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X