»   » హీరోయిన్ తో లాంగ్ డ్రైవ్ లో నాగ చైతన్య

హీరోయిన్ తో లాంగ్ డ్రైవ్ లో నాగ చైతన్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చల్లని వాతావరణం, కారు పక్క సీట్లో ప్రేయసి, మృదుమధురమైన సంగీతం.. లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లడానికి ప్రేమికులకు ఇంతకంటే మంచి సందర్భం ఏముంటుంది. ఇలాగే అనుకున్నారు నాగచైతన్య, కృతి సనన్‌. ఇంకేముంది? ఓ కారు తీసుకొని అలా లాంగ్‌డ్రైవ్‌కెళ్లి ఓ పాటేసుకున్నారు. ఆ ప్రయాణ సరిగమలు తెలియాలంటే మాత్రం 'దోచేయ్‌' చూడాల్సిందే. ఈ చిత్రం కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో వివిధ ప్రదేశాల్లో పాట చిత్రీకరణ జరిపారు. కాఫీడే, ప్రిన్స్‌ స్ట్రీట్‌ తదితర ప్రాంతాల్లోనూ షూటింగ్‌ జరిగింది.

సుధీర్ వర్మ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఓ సినిమాను నిర్మిస్తున్న . ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. క్లైమాక్స్ , కొన్ని పాటలు షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. చిత్రానికి బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Naga Chaitanya, Sudheer Varma film latest info.

ఈ సినిమాను మార్చి 20వ తేదిన విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాకు ‘దోచేయ్' అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. అయితే, నిర్మాతల నుండి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

చైతన్య సరసన ‘1 నేనొక్కడినే' ఫేం కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ తరహా జోనర్ లో చైతన్య సినిమా చేయడం ఇదే తొలిసారి. వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎస్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సన్నీ ఎంఆర్ సంగీత దర్శకుడు. త్వరలో ఆడియో విడుదల కానుంది.

''ప్రతి మోసం వెనుక ఇద్దరుంటారు. ఒకరు మోసం చేసేవాడు. మోసపోయేవాడు. నువ్వు రెండో వాడు కాకుండా ఉండాలంటే, మొదటివాడివి అయ్యితీరాల్సిందే..'' ఈ అంశం చుట్టూ తిరిగే కథే మా చిత్రం అంటున్నారు సుధీర్‌ వర్మ. కృతి సనన్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రై.లి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ-‘ అత్తారింటికి దారేది తర్వాత మా బ్యానర్‌లో స్వామిరారా టెక్నిషియన్స్‌తో చేస్తున్న సినిమా ఇది. నాగచైతన్య బర్త్‌డే సందర్భంగా విషెస్‌ తెలుపుతూ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, మరియు టీజర్‌ను విడుదల చేస్తున్నాం. నాగచైతన్య చాలా డెటికేటెడ్‌ ఆర్టిస్ట్‌. స్టైలిష్‌గా ఉండే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. నాగచైతన్య మూవీలో బెస్ట్‌ మూవీ అవుతుంది. ఆడియన్స్‌తో పాటు ఫ్యాన్స్‌కి కూడా బాగా నచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. పాటలు తప్ప టోటల్‌ టాకీ పార్ట్‌ కంప్లీట్‌ అయింది. పీటర్‌ హెయిన్స్‌ సారధ్యంలో ఒక థ్రిల్లింగ్‌ ఛేజ్‌ జరుగుతోంది'. అన్నారు.

ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణముర ళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌., ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌., ఆర్ట్‌: నారాయణరెడ్డి., కో-ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు., నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌., కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సుధీర్‌వర్మ.

English summary
Naga Chaitanya's upcoming film under the direction of Sudhir Varma is nearing completion. The makers are considering 'Dochey' as the title of the movie and we are said that the title is almost confirmed. The makers of the film are planning to release the film on March 20th as Ugadi Special.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu