»   » డీసెంట్ గా ఉంది: నాగచైతన్య కొత్త టీజర్‌ (వీడియో)

డీసెంట్ గా ఉంది: నాగచైతన్య కొత్త టీజర్‌ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:గౌతమ్ మేనన్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. ఈ చిత్రం ప్రత్యేక టీజర్‌ను నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు. ఆ టీజర్ చాలా డీసెంట్ గా ఉందంటూ ప్రసంశలు వస్తున్నాయి. ఆ టీజర్ ని ఇక్కడ మీరు ఇక్కడ చూసి...ఎలా ఉందో క్రింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి.

నాగ చైతన్య మాట్లాడుతూ...గౌతమ్ మీనన్ సినిమాలు చూస్తూ ఆయన సినిమాల్లో హీరోను కావాలనుకున్నాను. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం వస్తుందా అనుకుంటున్న సమయంలో 2009లో వచ్చిన ఏమాయ చేసావే చిత్రంతో నా కల నెరవేరింది. గౌతమ్‌మీనన్‌తో సినిమా అన్నప్పుడు నమ్మలేకపోయాను. అలాంటి దర్శకుడితో మరోసారి పనిచేయడం ఆనందంగా వుంది అన్నారు నాగచైతన్య.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నాగచైతన్య కంటిన్యూ చేస్తూ... ఏమాయ చేసావే సినిమాతో నేను ప్రేమకథా చిత్రాలకు బాగా సూటవుతానని గౌతమ్ మీనన్ నిరూపించారు. ప్రేక్షకుల్లో కూడా నా సినిమా అంటే మంచి క్రేజ్ మొదలైంది. ప్రేమకథా చిత్రాల్ని గౌతమ్ మీనన్ ఏవిధంగా తెరకెక్కిస్తారో యాక్షన్ ఎంటర్‌టైనర్‌లని కూడా అదే స్థాయిలో రూపొందిస్తారన్న పేరుంది. ఈ సినిమాలో ఫస్ట్‌హాఫ్ అంతా ఏమాయ చేసావే ఫ్లేవర్‌తో సాగితే సెకెండ్‌హాఫ్ యాక్షన్ నేపథ్యంలో వుంటుంది. ఇలా రెండు రకాల నేపథ్యంలో వున్న సినిమా ఒక నటుడిగా నాకు దక్కడం ఆనందంగా వుంది. ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాను అన్నారు.

Naga Chaitu's Saahasam Swaasaga Saagipo teaser2

గౌతమ్ మీనన్ మాట్లాడుతూ... కథకు అనుగుణంగానే టైటిల్‌ని పెట్టడం జరిగింది. ఈ టైటిల్ రేష్మా ఘటాల సూచించారు. ఇప్పటి వరకు 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. రెహమాన్ ఆరు అద్భుతమైన పాటలిచ్చారు. సినిమాలో మాత్రం నాలుగు పాటలే వుంటాయి. మంజిమ మోహన్ బ్రిలియెంట్ నటి. ఈ సినిమా తరువాత అంతా ఆమె ప్రేమలో పడిపోతారు. అంత అద్భుతంగా నటించింది అన్నారు.

మంజిమ మోహన్ హీరోయిన్. కోన వెంకట్ సమర్పణలో ఎం.రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి టీజర్ గతంలో రిలీజ్ చేసారు. దానికి మంచి స్పందన వచ్చింది. ఆ టీజర్ ని ఇక్కడ మరోసారి చూడండి.

సహజత్వానికి దగ్గరగా తెరకెక్కిన ఈ సినిమా రోటీన్ కమర్షియల్ ఫార్ములాను బ్రేక్ చేస్తుంది అని కోన వెంకట్ తెలిపారు. గౌతమ్ మీనన్, ఏ.ఆర్.రెహమాన్ వంటి గ్రేట్ టెక్నీషియన్‌లతో కలిసి తొలి సినిమా చేయడం గర్వంగా వుంది అని నిర్మాత రవీందర్‌రెడ్డి తెలిపారు.

English summary
Akkineni Naga Chaitanya's Saahasam Swaasaga Saagipo special teaser released and it was a decent one.
Please Wait while comments are loading...