»   » ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లు రాయరెందుకో? నిహారిక గురించి అడిగితే నాగశౌర్య రియాక్షన్!

ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లు రాయరెందుకో? నిహారిక గురించి అడిగితే నాగశౌర్య రియాక్షన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగ శౌర్య, నిహారిక జంటగా రామరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమ కథా చిత్రం 'ఒక మనసు'. ఈ నెల 24న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో మీడియాతో నాగ శౌర్య సినిమాకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు.

ఈ క్రమంలో నిహారికతో మీరు డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మీ స్పందన ఏమిటి? అనే ప్రశ్నకు నాగ శౌర్య సమాధానం ఇస్తూ....'నేను ఏ హీరోయిన్ తో వ‌ర్క్ చేస్తే ఆ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాను...ప్రేమ‌లో ప‌డ్డాను అంటూ రాస్తున్నారు. రాశీ ఖ‌న్నా, సోనారిక‌..ఆఖ‌రికి రెజీనాతో న‌టించ‌క‌పోయినా త‌న‌తో కూడా డేటింగ్ చేస్తున్నాను అంటూ రాసేసారు. ఇప్పుడు నిహారిక అంటున్నారు. ఫ‌స్ట్ ఇలాంటి వార్తలు విని మా ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఏంటిరా..ఈ వార్త‌లు అంటూ భ‌య‌ప‌డి పోయేవారు. ఇప్పుడు వాళ్ల‌కు అల‌వాటైపోయింది. అనుష్క అంటే నాకు ఇష్టం అని చాలా సార్లు చెప్పాను. కానీ...ఎప్పుడూ అనుష్క తో డేటింగ్ చేస్తున్న‌ట్టు రాయ‌లేదు ఎందుక‌నో..?' అని తెలిపారు.


'ఒక మనసు' సినిమా గురించి మాట్లాడుతూ ఈ చిత్రం సెన్సార్ పూర్త‌యింది. సెన్సార్ స‌భ్యులు చాలా మంచి రిపోర్ట్ ఇచ్చారు. ఒక్క క‌ట్ కూడా లేకుండా పాజిటివ్‌గా ఈ సినిమాను మెచ్చుకున్నారు. ఇందులో నేను సూర్య అనే పాత్ర‌లో చేశాను. ఒక‌మ్మాయి మ‌హిళ‌గా మారే వైనాన్ని, అబ్బాయి మ‌గ‌వాడిగా మారే క్ర‌మాన్ని ద‌ర్శ‌కుడు చాలా అందంగా తెర‌కెక్కించారు’ అన్నారు.


నిహారికతో కలిసి చేయడంపై..

నిహారికతో కలిసి చేయడంపై..

నీహారిక‌తో న‌టించ‌డం బావుంది. త‌ను పేరున్న ఇంటి అమ్మాయి క‌దా? క‌లుస్తుందో? లేదో అని అనుకున్నా. చాలా బాగా క‌లిసిపోయింది అన్నారు.


ఆ ఇద్దరే..

ఆ ఇద్దరే..

నాతో న‌టించిన నాయిక‌ల్లో మాళ‌విక‌, ఇప్పుడు నీహారిక‌తో న‌టించ‌డం ప‌ట్ల చాలా ఆనందంగా ఉన్నాను.


ఒక మనసు గురించి

ఒక మనసు గురించి

సినిమాలో ప్రేమ‌ను 10% చూపించామా..? 100% చూపించామా..? అనేదే ఉంటుంది త‌ప్పా...ప్రేమ అనే అంశం లేనిదే సినిమానే లేదు. ఇక మా సినిమా గురించి చెప్పాలంటే...మ‌రో చ‌రిత్ర‌, గీతాంజ‌లి, ఏమాయ చేసావే చిత్రాల వ‌లే ఒక మ‌న‌సు ప్రేక్ష‌క హృద‌యాల్లో నిలిచిపోతుంది.


తర్వాతి ప్రాజెక్టులు

తర్వాతి ప్రాజెక్టులు

నేను ఈ చిత్రం త‌ర్వాత జో అచ్యుతానంద చిత్రంలో చేస్తున్నాను. 65 శాతం షూటింగ్ పూర్త‌యింది. మ‌రోవైపు హుస్సేన్‌షా ద‌ర్శ‌క‌త్వంలో సుకుమార్ సినిమా ఉంది`` అని తెలిపారు.


English summary
Naga Shourya about Oka Manasu movie Niharika dating rumors.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu