»   » ఆగావా చచ్చావే' అంటున్న నాగశౌర్య (వీడియో)

ఆగావా చచ్చావే' అంటున్న నాగశౌర్య (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నాగశౌర్య, మాళవిక జంటగా నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కళ్యాణ వైభోగమే'. ఈ చిత్రం రిలీజ్‌ ట్రైలర్‌ను దర్శకురాలు నందినిరెడ్డి తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ట్రైలర్ ఫన్నీగా సాగే డైలాగులతో నిండిపోయి సినిమాపై ఆసక్తిని కలగచేస్తోంది.

రంజిత్‌ మూవీస్‌ పతాకంపై కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం మార్చి 4న ప్రేక్షకులముందుకు రానుంది. కల్యాణ్‌ కోడూరి సంగీతం సమకూర్చారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.ప్రస్తుత యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వారి మనోభావాలు , ప్రేమ, పెళ్లి పట్ల వారి అభిప్రాయాలు చూపుతూ సినిమాలు తీస్తే యూత్ ఖచ్చితంగా ఆదరిస్తున్నారు. అందుకేనేమో దర్శకురాలు నందినీ రెడ్డి ఆ పాయింట్స్ ని టచ్ చేస్తూ కళ్యాణ వైభోగమే రూపొందించింది. ఈ చిత్రం మార్చి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కె.ఎల్.దామోదర్ ప్రసాద్ నిర్మాత.


నందిని రెడ్డి మాట్లాడుతూ... పెళ్లి తర్వాత ప్రేమలో పడిన ఓ జంట కథ ఇది. వైవాహిక బంధం వారి జీవితంలో ఎలాంటి మార్పుల్ని తీసుకొచ్చింది? వారి ప్రేమపయనంలో ఎలాంటి మలుపులు ఎదురయ్యాయి అనేది తెరపై చూడాల్సిందే. కుటుంబ విలువలు, ప్రేమ, సెంటిమెంట్‌తో అంతర్లీనంగా చక్కటి వినోదాన్ని మేళవించి చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రేమ, పెళ్లి బంధాల పట్ల నవతరం మనోభావాల నేపథ్యంలో మా చిత్రాన్ని రూపొందిస్తున్నామన్నారు బి.వి. నందినిరెడ్డి.


నిర్మాత మాట్లాడుతూ.... సంగీత దర్శకుడు కళ్యాణ్ కోడూరి ఇచ్చిన పాటలు హిట్ అయ్యాయి నాగశౌర్య, మాళవిక నాయర్ జంట ఆకట్టుకుంటుంది. ప్రేమను సరికొత్త కోణంలో ఆవిష్కరించే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకముంది అని తెలిపారు.


రాశి, ఐశ్వర్య, ఆనంద్, రాజ్ మాదిరాజ్, తాగుబోతు రమేష్, ధన్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జి.వి.ఎస్.రాజు, ఎడిటర్: జునైద్ సిద్దిఖ్, సహనిర్మాతలు: వివేక్ కూచిభోట్ల, జగన్‌మోహన్‌రెడ్డి.వి.

English summary
Kalyana Vaibhogame is all set to hit screens on March 4. Directed by Nandini Reddy, the film was supposed to release in February but was postponed because of other releases.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu