»   » ఒక్కరు‌చాలు..కుప్పలెందుకు? జయసుధ ప్యానెల్‌పై నాగబాబు ఫైర్

ఒక్కరు‌చాలు..కుప్పలెందుకు? జయసుధ ప్యానెల్‌పై నాగబాబు ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాజకీయ నాయకులకు ఏ మాత్రం తీసిపోకుండా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న రాజేంద్రప్రసాద్ ప్యానెల్‌పై...... జయసుధ ప్యానెల్ చేసిన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ అయింది. తమను బెదిరిస్తున్నారంటూ జయసుధ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Nagababu about MAA elections

ఈ పరిణామాలపై స్పందించేందుకు రాజేంద్రప్రసాద్ ప్యానెల్ బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. రాజేంద్ర ప్రసాద్‌కు మద్దతుగా ఉంటూ వచ్చిన నాగబాబు ప్రత్యర్థి ప్యానెల్ చేసిన ఆరోపణలపై భగ్గుమన్నారు. నాగ బాబు మాట్లాడుతూ...‘ఈ సారి నేను పోటీ చేయడం లేదు, కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని మురళీ మోహన్ గారే చెప్పారు. కొందరు యువ హీరోలను కలిస్తే ఆ పదవికి తమ అనుభవం సరిపోదు. సమయం కూడా ఉండదని తప్పుకున్నారు. అప్పుడు శివాజీ, ఉత్తేజ్, కాదంబరి కిరణ్ లాంటి వారు రాజేంద్రప్రసాద్ ను నిలబడమని అడిగితే ఆయన నిలబడ్డారు' అన్నారు.

‘తొలుత కొందరు పెద్దలు కూడా మద్దుతు ఇచ్చి ఏకగ్రీవం చేస్తానని చెబితేనే రాజేంద్రప్రసాద్ బరిలోకి దిగారు. కానీ తర్వాత జయసుధను బరిలోకి దింపారు. ఇదే విషయమై మురళీ మోహన్ గారిని అడిగితే రాజేంద్రప్రసాద్‌కు స్టేచర్ లేదంటూ మాట్లాడారు. ఆయన మంచితనం, సినిమా రంగంలో ఆయకు ఉన్న అనుభవం చూసి ఆయనకు మద్దతుగా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చు. కానీ మాపై సిల్లీ ఆరోపణలు చేయడమే బాధగా ఉంది. మేము ఏదో రాజకీయాలు చేస్తున్నామని అంటున్నారు. బెదిరిస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, జూ ఎన్టీఆర్ మాత్రమే కాదు....వందల మంది ఆర్టిస్టులు. పేద కళాకారులకు ఎలాంటి న్యాయం జరుగడం లేదు. అసోసియేషన్లో రూ. 3 కోట్ల ఫండ్ ఉందంటున్నారు. కానీ పేద కళాకారులకు ఎలాంటి సహాయం చేయడం లేదు. కళాకారులకు మెడిక్లైమ్ లేదు. అసోసియేషన్ మెంబర్ షిప్ రూ. 1 లక్ష చేసారు. పెద్ద మొత్తంలో ప్రవేశ రుసుము పెట్టి పేద కళాకారులు అసోసియేషన్లోకి రాకుండా గేట్లే వేసారు' అంటూ నాగ బాబు వ్యాఖ్యనించారు.

‘కళాకారులంతా ఒక్కసారి ఆలోచించుకోండి. సేవ చేసే వారిని గెలిపించండి. మార్పు కావాలంటే ఒక్కరు చాలు...కుప్పులు కుప్పలుగా ప్యానెల్స్ వేసి ముందుకు రావాల్సిన పని లేదు. ఆ ఒక్కరే రాజేంద్రప్రసాద్. ఇదే మా కమిట్మెంట్' అంటూ నాగబాబు ముగించారు.

English summary
Tollywood actor Nagababu about MAA elections.
Please Wait while comments are loading...