»   » అన్నయ్యకు నటుడుగా ఫాలోయింగ్ ఉంటే, కళ్యాణ్ కి వ్యక్తిగతంగా కూడా ఉంది: నాగబాబు

అన్నయ్యకు నటుడుగా ఫాలోయింగ్ ఉంటే, కళ్యాణ్ కి వ్యక్తిగతంగా కూడా ఉంది: నాగబాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా ఫ్యామిలీలో చీలికలు ఉన్నట్టా లేనట్టా..? ఈ విషయం లో అసలు మెగా ఫ్యామిలీ అభిప్రాయాలు ఎలా ఉన్నా బయట మాత్రం భిన్న అభిప్రాయాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాము సిద్దాంత పరంగా ఎలాంతి ఉద్దేశాలతో ఉన్నా అన్నా తమ్ములుగ మాత్రం వేరు కాలేదు అన్న మెసేజ్ ఇస్తూనే ఉన్నారు మెగా బ్రదర్స్. చిరు బర్థ్ డేకి పవన్ ఇంటికి వెళ్ళి మరీ మెగా స్టార్ తో కలిసి ఫొతోలు దిగాడు.

ఇక పవన్ పుట్టిన రోజుకు సతీ సమేతంగా చిరంజీవి ఏకంగా పవన్ సినిమా సూటింగ్ జరిగే సెట్స్ మీదకే వెళ్ళాడు.. అంతే కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్ల కలిగిన ఇబ్బందివల్ల కాస్త ఘటుగానే స్పందించి పవన్ అంటే కోపం ఉందేమో అన్న అభిప్రాయం తెచ్చుకున్నా రీసెంట్ ఇంటర్వ్యూలో తన తమ్ముడి మీద వ్యక్తిగతంగానూ, ఒక రాజకీయ నేత గానూ తమ్మున్ని మెచ్చుకుంటూ ఇలా చెప్పాడు....

మెగా బ్రదర్ నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు

సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి, అతని సత్తా గురించి మెగాబ్రదర్ తనదైన శైలిలో విశ్లేషించారు. మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కటేనని.. మెగా ఫ్యాన్స్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా వుంటారని.. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే మెగా ఫ్యాన్సేనని.. అంతా మా వాళ్లేనని చెప్పుకొచ్చారు.

అంతా ఒక్కటే

అంతా ఒక్కటే

మెగా కుటుంబానికి సంబంధించిన మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్, మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ అంతా ఒక్కటేనన్నారు. తమ హీరోల సినిమాలు రిలీజైతే థియేటర్స్ కి వెళ్లి ప్రతి సినిమా ఆరేడు సార్లు చూస్తారన్నారు. టీడీపీ వాళ్లు విజబుల్‌గా తేలుస్తున్నారు.

చాలా బీభత్సమైన ఫాలోయింగ్

చాలా బీభత్సమైన ఫాలోయింగ్

కానీ, అండర్‌లైన్‌లో కల్యాణ్ బాబుకు ఎంత ఫాలోయింగ్ ఉందనేది మాకు తెలుసు. మాతోపాటు చాలా మందికి తెలుసు. కానీ దాన్ని ఎవరూ బయటకు చెప్పడం లేదు. చెప్తే ఎక్కడ దొరికిపోతామో అని చెప్పట్లేదు. చాలా బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్‌ను ఊహించడం కూడా కష్టం.

కల్యాణ్ బాబు ఫాలోయింగ్ ఒక డిఫరెంట్ ఫాలోయింగ్

కల్యాణ్ బాబు ఫాలోయింగ్ ఒక డిఫరెంట్ ఫాలోయింగ్

అది ఎలాంటి ఫాలోయింగో చెప్తాను చూడండి.. టిపికల్‌గా అలాంటి ఫాలోయింగ్ ఎమ్జీఆర్‌కు ఉండేది. అలాగే కన్నడ రాజ్‌కుమార్‌ గారికి ఉండేది. తెలుగులో రామారావు గారికి ఉండేది. అన్నయ్యగారికి ఉంది.. బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉంది. కానీ, కల్యాణ్ బాబు ఫాలోయింగ్ ఒక డిఫరెంట్ ఫాలోయింగ్.

ఆ ఫాలోయింగ్ ఎవరికీ రాదు

ఆ ఫాలోయింగ్ ఎవరికీ రాదు

అన్నయ్యకు నటుడిగా ఫాలోయింగ్ ఉంటే.. కల్యాణ్ బాబుకు నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఉంది. అతను పబ్లిక్‌లో తిరిగిన విధానం, చేసిన పనులే అతడికి వ్యక్తిగతంగా ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. ఆ ఫాలోయింగ్ ఎవరికీ రాదు. నాకు తెలిసి టాలీవుడ్‌లో ఆ ఫాలోయింగ్ ఎవరికీ లేదు.'' అని నాగబాబు చెప్పుకొచ్చారు.

కళ్యాణ్ బాబుది దూకుడు తత్వం

కళ్యాణ్ బాబుది దూకుడు తత్వం

అయితే.. జనసేన అధినేత... కళ్యాణ్ బాబుది దూకుడు తత్వం.. అగ్రెసివ్. అంటే నెగెటివ్ కాదు. తర్వాత ఏంటి అని ఆలోచించకుండా ముందుకెళ్లే డాషింగ్ పర్సనాలిటీ. దేనికైనా నిలబడతాననే దమ్మున్న వ్యక్తి. ఎగ్రెసివ్. పని చేద్దామంటే చేయాల్సిందే. అనుకుంటే చేసి తీరతాడు.

పది మందికి ఉపయోగపడుతుందంటే

పది మందికి ఉపయోగపడుతుందంటే

ఆలోచించి ఏదీ చేయడు. పది మందికి ఉపయోగపడుతుందంటే... ఏ పనికైనా వెనుకాడడు. అని చెప్పారు మెగా బ్రదర్ నాగబాబు. ఇక విమర్శకులని మనం అలాగే వదిలేస్తే.. తప్పు మనదే అవుతుంది. మనల్ని ఎవడన్నా దూషిస్తుంటే భరించడం ముమ్మాటికీ తప్పేనన్నారు.

English summary
Mega brother Nagababu speaks about Pawan Kalyan on his birth day
Please Wait while comments are loading...