Just In
- 8 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 8 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 9 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 10 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- Lifestyle
ఆదివారం దినఫలాలు : వ్యాపారులు ఈరోజు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నీపై ఎప్పుడూ నెగెటివ్ రాలేదు.. నాగార్జుననే ఏకిపారేశారు.. అభిజిత్‌తో నాగబాబు ముచ్చట్లు
బిగ్ బాస్ షో గడిచినా దాని తాలుకా విజయాలు, వివాదాల యాత్ర మాత్రం ముగియడం లేదు. సోహెల్ అభిజిత్ అఖిల్ ఇలా ఎవరో ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. మీడియా, సోషల్ మీడియాలో ఏదో రకంగా హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. తాజాగా అభిజిత్ మెగా బ్రదర్ నాగబాబు మీటింగ్, దానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆ మీటింగ్‌లో అభిజిత్‌తో నాగబాబు మాట్లాడిన మాటలు, అభిజిత్ గురించి నాగబాబు చెప్పిన మాటలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

గెలవాలని గెలుస్తాడని..
బిగ్ బాస్ షోలో నాకు అవినాష్ మాత్రమే తెలుసు.. మిగతా వాళ్లెవ్వరూ తెలీదు.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూడటం లేదా తెలిసిన వాళ్లు షో గురించి మాట్లాడటం, ఆ తరువాత నేను కూడా రెండు మూడు సార్లు చూసిన దాంట్లో కూడా అభిజిత్ గురించి ఎక్కువగా విన్నాను చూశాను.. అతను గెలవాలని ఆశించాను.. గెలుస్తాడని నమ్మకంగా అనుకున్నానంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు.

కలవాలని అనుకున్నాను..
నేను అనుకున్నట్టు.. ఊహించినట్టు.. కోరుకున్నట్టు అభిజిత్ గెలిచాడు. అయితే గెలిచాక అభిజిత్‌ను కలవాలని అనుకున్నాను. కానీ బిగ్ బాస్ సక్సెస్‌తో బిజీగా ఉంటాడని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఊరుకున్నాను. కానీ అతనే ఫోన్ చేసి కలుస్తాను అని చెప్పాడు. అలా మేం కాసేపు సరదాగా ముచ్చట్లు పెట్టుకున్నామని నాగబాబు చెప్పుకొచ్చాడు.

బిగ్ బాస్ ముచ్చట్లు..
ఇక నాగబాబు అభిజిత్ కలిసి బిగ్ బాస్ ఇంటి గురించి ముచ్చట్లు పెట్టుకున్నారు. అక్కడ 105 రోజులు ఉండటం చాలా కష్టమని నాగబాబు చెప్పుకొచ్చాడు. కనీసం టైం ఎంత అవుతుందో కూడా తెలీదు.. ఫుడ్ కూడా సరిగ్గా ఉండేది కాదంటూ అభిజిత్ తమ కష్టాలను చెప్పుకొచ్చాడు. మరి టైం తెలీకుండా ఎలా ఉన్నారంటూ.. లైట్స్ ఆన్, ఆఫ్ అయితే అర్థమయ్యేదని అభిజిత్ చెప్పుకొచ్చాడు.

హారిక మోనాల్ ట్రాక్..
మోనాల్ అయిపోయాక హారికతో ట్రాక్ నడిపిస్తున్నాడు అది గేమ్ స్ట్రాటజీ అనుకున్నామని నాగబాబు అభిజిత్‌తో చెప్పుకొచ్చాడు. అలా ఏం లేదు సర్.. హారికను ఎన్నో సార్లు సిస్టర్ అన్నాను.. నాగార్జున సర్ ముందు కూడా అన్నాను కానీ అది మాత్రం ఎడిట్ చేసి వేరేలా ప్రొజెక్ట్ చేశారని అభిజిత్ తన బాధను బయట పెట్టేశాడు.

నాగార్జునపై ట్రోలింగ్...
నాగబాబు అభిజిత్ ఇమేజ్ గురించి మాట్లాడుతూ.. నీపై ఎప్పుడు కూడా నెగెటివ్ రాలేదు.. నీ కోసం నాగార్జునను దారుణంగా ట్రోల్ చేశారు.. ఏకిపారేశారు.. మోనాల్ విషయం మోకాళ్ల మీద నిలబడి క్షమించమన్నప్పుడు నాగార్జుననే ట్రోల్ చేశారంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి అభిజిత్‌కు సినీ కెరీర్ పరంగా నాగబాబు అండగా ఉంటానని చెప్పకనే చెప్పేశాడు. తనకు తెలిసిన వాళ్లందరికీ అభిజిత్ గురించి చెబుతున్నాడట.