»   » చేతకాని తనంతో నాగబాబు ఆవేదన-దానిని కవర్ చేసిన కళ్యాణ్...

చేతకాని తనంతో నాగబాబు ఆవేదన-దానిని కవర్ చేసిన కళ్యాణ్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిర్మాత డబ్బు పెడుతుంటే...ఎన్ని రోజుల్లో సినిమా తియ్యాలి?అనే ఇంకిత జ్ఝానం కూడా లేని దర్శకులున్నారు. శరీరంలోకి చేరే వైరస్ లా తయారయ్యారు. కొన్నాళ్లకు శరీరాన్ని తినేస్తుంది. దయ చేసి నిర్మాతను బతకనియ్యండి. ఎంతో మంది నిర్మాతలు పరిశ్రమ నుంచి వెళ్లిపోతున్నారు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతలను బ్రతికించండి అంటూ మెగా నిర్మాత అడుక్కోవడం చాలా విచిత్రంగా వుంది.

రవితేజ నటించిన 'మిరపకాయ్" ఆడియో వేడుక దర్శకుల పనితీరు పట్ల నాగబాబు విసిరిన విమర్శనాస్త్రాలతో చాలా ఘాటుగా సాగింది. రామ్ గోపాల్ వర్మను చూసి దర్శకులు బుద్ది తెచ్చుకోవాలనే టైపులో ఎక్కువ రోజులు సినిమాలు తీస్తున్న దర్శకులను నాగబాబు ఉతికి ఆరేశాడు. ఈ వేడుకలో రాజమౌళి, వివి వినాయక్ కూడా పాల్గొన్నారు. ఎక్కువ రోజోలు సినిమాలు తీసే జాబితాలో వీళ్లిద్దరూ ఉన్నారు. కానీ నాగబాబు మాటలకు వారి మూడ్ అప్ సెట్ అవ్వకూడదనుకున్నాడో ఏమో..సి కళ్యాణ్ మాట్లాడుతూ ..రాజమౌళి, వివి వినాయక్ లు ప్రతిభావంతులు. అలాంటి వారికి నాగబాబు మాట్లాడిన మాటలు వర్తించవనే టైపులో కలరింగ్ ఇచ్చాడు. ఈ ఇద్దరి దర్శకులకు అంత సర్థి చెప్పాల్సిన అవసరం కళ్యాణ్ కు ఏంటో...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu