»   » నువ్వు ఇప్పుడు నాగబాబుకు ఫోన్‌ చేసి తిట్టు’ అని పవన్ చెప్పారు : సమీర్

నువ్వు ఇప్పుడు నాగబాబుకు ఫోన్‌ చేసి తిట్టు’ అని పవన్ చెప్పారు : సమీర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చాలామందికి సమీర్ అనగానే గుర్తురాక పోవచ్చు గానీ టీవీ సీరియల్లు చూసే వాళ్లకి మాత్రం ఈ పేరు చిరపరిచితమే. దాదాపు బుల్లితెరమీద స్టార్ రేంజ్ ఉన్న సమీర్ అడపాదదపా సినిమాల్లో కూడా కనిపిస్తూనే ఉంటాడు. ఎక్కువగా పోలీస్ పాత్రలతో ఆకట్టుకున్న ఈ నటుడు ఆమధ్య అత్తారింటికి దారేది లో కూడా కనిపించాడు.

అయితే ఆ సినిమాకి ముందే పవన్ కీ సమీర్ కీ పెద్ద గొడవ వల్ల పరిచయం జరిగిందట. ఆ గొడవకూడా ఏదో వేరేది కాదు పవన్ సినిమాని వెటకారం చేయటం వళ్ళే అంటూ ఇన్నాళ్ళకి చెప్పాడు సమీర్. అంతే కాదు ఫోన్ చేసి మా అన్నయ్యని తిట్టు అంటూ... నాగబాబుని తిట్టమని కూడా చెప్పాడట. తిట్టమనటం అంటే పవన్ కి కొపం కాదు సినిమా గురించి అభిప్రాయం చెప్తే తిట్టటం వల్ల.., నీకు అలా చెప్పే హక్కు ఉంది కాబట్టి నువ్వూ తిట్టవచ్చు అని చెప్పాడట... ఆ సంఘటన గురించి సమీర్ మాటల్లోనే....

'ఎన్నో అంచనాల మధ్య విడుదలైన పవన్‌ నటించిన ఓ సినిమా దారుణ పరాజయం పాలైంది. దాంతో పవన్‌ అభిమానినైన నేను ఆవేదనకు గురై ఆ సినిమా గురించి ఫేస్‌బుక్‌లో రాశాను. ఆ తర్వాతి రోజు ఉదయాన్నే నాగబాబుగారు ఫోన్‌ చేసి తిట్టారు. దాంతో నేను ఆ కామెంట్‌ను తొలగించాను. ఆ తర్వాత పవన్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. 'నీ అభిప్రాయం నువ్వు చెప్పావు. నాగబాబు నిన్ను తిట్టడం తప్పు. నువ్వు ఇప్పుడు నాగబాబుకు ఫోన్‌ చేసి తిట్టు' అని చెప్పారు. నేను అలా చేయలేదు. దాంతో ఆ వివాదం కామప్‌ అయిపోయింది.

Nagababu Overreacted for Facebook Post on Pawan Kalyan said Sameer

దాదాపు నాలుగేళ్ల తర్వాత డైరెక్టర్‌ త్రివిక్రమ్‌గారి నుంచి ఫోన్‌ వచ్చింది. 'అత్తారింటికి దారేది' సినిమాలో ఓ క్యారెక్టర్‌ కోసం నన్ను పిలిచారు. నేను స్పాట్‌కు వెళ్లగానే పవన్‌ నన్ను పలుకరించి, తన గదిలోకి రమ్మన్నారు. నేను వెళ్లాను. 'ఏంటి ఇక్కడున్నావు' అని అడిగారు. 'ఈ సినిమాలో నేను చేస్తున్నా సార్‌' అని చెప్పా.

వెంటనే త్రివిక్రమ్‌గారిని పిలిపించమన్నారు. త్రివిక్రమ్‌ రాగానే నాలుగేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో నేను చేసిన పని గురించి ఆయనకు చెప్పారు. 'ఈ సినిమాలో మీకు సమీర్‌ కావాలా? నేను కావాలా?' అని అడిగారు. త్రివిక్రమ్‌ కొద్దిసేపు ఆలోచించి 'నాకు సమీరే కావాలి' అని చెప్పారు. దాంతో పవన్‌ పెద్దగా నవ్వి, త్రివిక్రమ్‌ను కౌగిలించుకున్నారు. అప్పుడు అర్థమైంది వారిద్దరూ నన్ను ఆడుకుంటున్నారని. వారి మధ్య ఎంత అండర్‌స్టాడింగ్‌ ఉంటుందో కూడా నాకు అప్పుడే తెలిసింద'ని సమీర్‌ చెప్పాడు.

English summary
Artist Sameer is known as a non-controversial actor who minds his own business. That doesn’t mean controversies won’t bump into him, unknowingly. For a genuine opinion he shared on the Facebook, he was given left and right by Nagababu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu