twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిలాక్స్ అవ్వండి.. జనసైనికులు ఎంజాయ్ చేసేయండి.. ఇది శాశ్వతం కాదు: నాగబాబు సంచలన వ్యాఖ్యలు

    |

    Recommended Video

    Nagababu Sensational Comments On Janasena Party Defeat,Congratulates YS Jagan || Filmibeat Telugu

    ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఇటు తెలుగు దేశం పార్టీకి, అటు జనసేన పార్టీకి చుక్కలు చూపించాయి. ఫలితాల తర్వాత ఊహించని రీతిలో తమ పరాజయాన్ని చూసి షాక్ అయ్యారు ఇరు పార్టీల నేతలు. తెలుగు దేశం పార్టీ కనీసం టు డిజిట్ స్కోర్ అయినా దాటింది కానీ జనసేన మాత్రం కేవలం ఒక్క స్థానానికే పరిమితమై తన సత్తా ఏంటో బయటపెట్టింది. ఫలితాల అనంతరం జనసేన వర్గాలపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. పవన్ ఇక తన అన్నయ్య బాటే పెడతారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి..

    మై ఛానల్ నా ఇష్టం

    మై ఛానల్ నా ఇష్టం

    ఎన్నికలకు ముందే మై ఛానల్ నా ఇష్టం పేరుతో ఓ యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు నాగబాబు. దీని ద్వారానే ప్రత్యర్థులపై విరుచుకు పడిన ఈయన.. జనసేన ఓటమిపై కూడా ఇదే ఛానెల్ లో స్పందించడం విశేషం. నరసాపురం ఎంపీగా పోటీచేసిన నాగబాబు, గాజువాక- భీమవరం రెండు స్థానాల్లో పోటీ చేసిన పవన్ ఇద్దరూ డీలా పడటంపై ఆయన కాస్త డిఫరెంట్ గానే స్పందించారు.

     జగన్‌కు మా సహకారం

    జగన్‌కు మా సహకారం

    ఇటీవలే ఎలక్షన్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పార్టీ అఖండ విజయం సాధించింది. వైసీపీ అధినేత వై.యస్.జగన్‌మోహన్ రెడ్డికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. మీరు ఏపీ ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరుతున్నాను. జగన్‌కు మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అని నాగబాబు అన్నారు.

    ప్రజలకు డబ్బులు పంచకుండా

    ప్రజలకు డబ్బులు పంచకుండా

    క్లీన్ పాలిటిక్స్‌ అంటూ జనసేన తరఫున ప్రజల ముందుకొచ్చాము. పవన్ కళ్యాణ్, నేను, నాతో పాటు అనేక మందిమి ప్రజలకు డబ్బులు పంచకుండా ఎలక్షన్స్ లో పాల్గొన్నాం. జనసేన పార్టీకి కొన్ని లక్షల ఓట్లు వచ్చాయి. అంటే ఈ లెక్కన లక్షలాది మంది ప్రజలు క్లీన్ పాలిటిక్స్‌ని కోరుకుంటున్నారనేగా అర్థం. నసేన గెలవలేకపోచ్చు.. నైతికంగా మాత్రం మనం గెలిచాం అని తమ పార్టీని సమర్ధించుకున్నాడు నాగబాబు.

    జనసైనికులు ఎంజాయ్ చేసేయండి.. ఇది శాశ్వతం కాదు

    జనసైనికులు ఎంజాయ్ చేసేయండి.. ఇది శాశ్వతం కాదు

    ఇక చివరగా జనసైనికులకు జనసైనికులు ఎంజాయ్ చేసేయండి. రిలాక్స్ అవండి అని నాగబాబు పిలుపునివ్వడం గమనార్హం. జనసేనను ముందుండి నడిపించిన జనసైనికులు, వీర మహిళలను చూసి బాధేసింది. అయితే ఈ పరాజయం శాశ్వతం కాదు. విరామం మాత్రమే. మన సేవను ఇలానే కొనసాగిద్దాం. ఇంకా గొప్పగా ప్రజాసేవ చేద్దాం. ఒక నెల పాటు రిలాక్స్ అవ్వండి అని నాగబాబు పేర్కొనడం ఆసక్తికర అంశం.

    English summary
    In 2019 Ap Election results ycp creates a victory. On this issue Nagababu response with his you tube channel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X