»   » మెగాస్టార్ ఫ్యామిలీ నుండి మరో హీరో!

మెగాస్టార్ ఫ్యామిలీ నుండి మరో హీరో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ రోజు ఏ విషయం చూసినా వారసత్వం అనేది ఒకటి కనిపిస్తుంది. రాజకీయ నాయకులు తమ కొడుకులు తమ ప్రస్థానాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటుంటే సినిమా యాక్టర్లు కూడా మత కొడుకులు హీరోలుగా తమ స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నారు..ఇలా ప్రతి తండ్రి తమ కొడుకులు తమ వారస్తవాన్ని ప్రదర్శించాలని కోరుకుంటున్నారు..

ప్రస్తుతం అదే దారిలో వస్తున్నాడు నాగబాబు తనయుడు వరుణ్. గతంలో 'ఇంద్ర" సినిమాలో తప్పు కనిపెట్టిన వాడిగా ఇతన్ని పరిచయం చేశారు. పవన్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మరి ఇప్పుడు మెగా ఫ్యామీలీ నుండి వస్తున్న మరో హీరో ..వరుణ్. నిజానికి వరుణ్ ని రామ్ చరణ్ కంటే ముందు పరిచయం చేయాలని చూశారు..కానీ చిరు రాజకీయం అందుకు అడ్డుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఇండస్ట్రీని శాసిస్తుండగా..అల్లు అర్జున్ అతని దారిలో అతను వెళుతుండగా పవన్ పంజాకు పని పెడుతున్న తరుణంలో ఎవరికి వారు బిజీగా ఉండటంతో వరుణ్ ఎవరికి అడ్డుపడడని ఆలోచించిన మెగా ఫ్యామిలీ వరుణ్ ని వదలడానికి నిర్ణయం తీసుకుందని సమాచారం.

యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్స్ ఇలా తనని తాను నిరూపించుకోవడానికి అన్నింటిలో పరిజ్ఝానం సంపాదించిన వరుణ్ కోసం ఓ అద్భుతమైన కథ కూడా రెడీ అయిందని సమాచారం మరి వరుణ్ ని ఎవరు పరిచయం (దర్శకుడు) చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu