»   » వాళ్లు ఏమీ చేయలేరు: ‘నా పేరు సూర్య’ కుట్రలపై నాగబాబు రియాక్షన్

వాళ్లు ఏమీ చేయలేరు: ‘నా పేరు సూర్య’ కుట్రలపై నాగబాబు రియాక్షన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nagababu Strong Counter To Bad Review Writers

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా'. మే 4న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఇష్యూ తర్వాత మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయాలని భావించిన కొందరు ఈ చిత్రంపై కుట్రలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ విషయాన్ని అల్లు అరవింద్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సాక్షిగా ప్రకటించడంతో అందరూ షాకయ్యారు. సినిమా మీద నెగెటివ్ పబ్లిసిటీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ విషయమై తాజాగా నాగబాబు స్పందించారు.

ఎవరేం చేసినా సినిమాను ఏమీ చేయలేరు

ఎవరేం చేసినా సినిమాను ఏమీ చేయలేరు

‘నా పేరు సూర్య' సినిమాపై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏమీ చేయలేరని, సినిమా చాలా బావుంది, మంచి సినిమాపై ఎలాంటి కుట్రలు చేసినా ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా ఆపలేరని నాగబాబు వెల్లడించారు.

వారి రివ్యూలు కోట్ల మంది ప్రేక్షకుల రిప్రజంటేషన్ కాదు.

వారి రివ్యూలు కోట్ల మంది ప్రేక్షకుల రిప్రజంటేషన్ కాదు.

ఇక రివ్యూల విషయానికొస్తే... సినిమా చూసి రివ్యూ రాసేది ఒక మనిషి. రివ్యూ అనేది రాసే వ్యక్తి ఒపీనియన్ తప్ప... కోట్ల మంది ప్రేక్షకుల రిప్రజంటేషన్ కాదు. వారు ఎవరైనా సరే వారికి ఒక ఒపీనియన్ ఉంటుంది. అది గొప్పగానూ ఉండొచ్చు, పరమ చండాలంగానూ ఉండొచ్చు. ఒక సినిమా బాగోలేదు, యావరేజ్‌గా ఉందని వారు చెప్పిన తర్వాత కూడా...ఆ సినిమా రికార్డులు బ్రేక్ చేయవచ్చు అని నాగబాబు అన్నారు.

రంగస్థలం విషయంలోనూ కొందరు ఇలా చేశారు

రంగస్థలం విషయంలోనూ కొందరు ఇలా చేశారు

‘రంగస్థలం' మీద కూడా కొంత మంది బ్యాడ్ రివ్యూస్, యావరేజ్ రివ్యూలు రాశారు. కానీ ఆ చిత్రం నాన్ బాహుబలి రికార్డులన్నీ బ్రేక్ చేసింది. రివ్యూలను మేము లెక్కచేయం. ఎందుకంటే రివ్యూలను బట్టి సినిమాలు ఆడవు.... అని నాగబాబు అన్నారు.

ప్రేక్షకులే రియల్ జడ్జిలు

ప్రేక్షకులే రియల్ జడ్జిలు

ఒక సినిమా వచ్చిందంటే జనాలకు అది బావుందా? లేదా? అనేది తెలుస్తుంది. వారు మనలాగా ఎనలైజ్ చేయలేక పోవచ్చు. మనలాగా అండర్ స్టాండ్ చేసుకోలేక పోవచ్చు. వారికి సినిమాలో ఏ పాయింట్ నచ్చినా కనెక్ట్ కావొచ్చు. కొన్ని కొన్ని సినిమాలకు కనెక్ట్ కారు. ఆ సినిమాలు అలాగే పోతాయి. కొన్ని సినిమాల మీద విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ప్రేక్షకులే రియల్ జడ్జిలు.... అని నాగబాబు తెలిపారు.

English summary
Nagababu Strong Counter To Bad Review Writers. Naga Babu said that nobody can stop good films like Naa peru Surya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X