»   » తమ్ముడు అందుకే నన్ను పిలవడం లేదు: నాగ బాబు

తమ్ముడు అందుకే నన్ను పిలవడం లేదు: నాగ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి, జనసేన పార్టీలో చేరడం గురించి మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. జనసేనలో పనిచేయాలని తమ్ముడు కోరుకుంటే, తాను పార్టీలో చేరడానికి సిద్ధమేనని తెలిపారు. ఒకవేళ పవన్ పిలిస్తే ఓ కార్యకర్తలా పని చేయడానికి తాను సిద్ధమని అన్నారు.

మీరు మీరుగా ఎందుకు పార్టీలోకి వెళ్లడం లేదు అనే ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ... అందరిలా తాను పార్టీలో చేరడానికి తాను పబ్లిక్ కాదని, పవన్ కళ్యాణ్‌కు అన్నయ్యనని నాగబాబు సమాధానం చెప్పారు.

అందుకే పిలవడం లేదు

అందుకే పిలవడం లేదు

తమ్ముడు నన్ను పార్టీలోకి ఆహ్వానించకపోవడానికి కారణం జీవితంలో తాను పడిన కష్టాలేనని చెప్పారు. ఇకపై తాను ఎలాంటి కష్టాలు పడకూడదనే ఆలోచనతోనే తనను పార్టీలోకి పిలవలేదని నాగబాబు అన్నారు.

నేను మైనస్ కాకూడదు కదా

నేను మైనస్ కాకూడదు కదా

జనసేనలో చేరడం వల్ల తమ్ముడికి నేను ప్లస్ కాకున్నా పర్వాలేదు కానీ, మైనస్ మాత్రం కాకూడదని, అందుకే జనసేన పార్టీకి బయటి నుండి సపోర్టు ఇస్తానని నాగబాబు ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అన్నదమ్ములపై అభిమానం

అన్నదమ్ములపై అభిమానం

తనకు అన్నయ్య చిరంజీవి అన్నా, తమ్ముడు కళ్యాణ్ బాబు అన్నా ఎంతో ఇష్టమని తెలిపారు..... ఇద్దరూ తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తులు అని నాగబాబు తెలిపారు.

నష్టాల్లో సపోర్టు ఇచ్చారు

నష్టాల్లో సపోర్టు ఇచ్చారు

తాను నిర్మించి 'ఆరెంజ్' సినిమా వల్ల చాలా నష్టపోయాను, అప్పుడు అన్నయ్య, తమ్ముడు తనకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అయినప్పటికీ ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలనే బాధతో చాలా కాలం గడిపానన్నారు. బుల్లితెర సహాయంతోనే తాను పరిస్థితులను అధిగమించానని చెప్పారు.

English summary
Actor, Producer, brother of Jana Sena Chief Pawan Kalyan, Nagabau expressed his desire to work with Jana Sena party, if he gets an official call from Jana Sena.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu