»   » మనోధైర్యంతో జయించవచ్చు: కాన్సర్ గురించి నాగార్జున

మనోధైర్యంతో జయించవచ్చు: కాన్సర్ గురించి నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: క్యాన్సర్‌ని ప్రారంభ దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడటం సులభమని సినీనటుడు అక్కినేని నాగార్జున అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాన్సర్‌ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. క్యాన్సర్‌ వ్యాధిగ్రస్థులు మనోధైర్యంతో ఉండాలని అప్పుడే వ్యాధిని జయించగలరని నాగార్జున సూచించారు. ఏటా జూన్‌ మొదటి ఆదివారాన్ని జాతీయ క్యాన్సర్‌ సర్వైవర్స్‌ డే గా నిర్వహిస్తుంటారు.

ఈ సందర్భంగా కిమ్స్‌ ఆసుపత్రి యాజమాన్యం క్యాన్సర్‌తో బాధపడేవారికి అండగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వ్యాధి బారినపడినవారు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదని క్యాన్సర్‌ను జయించిన వారు, వైద్యులు వారికి అండగా నిలవాలని కిమ్స్‌ ఆసుపత్రి పిలుపునిచ్చింది.

ఇక నాగార్జున తాజా చిత్రం విషయానికి వస్తే...

Nagarjuna about cancer @ Kims

మనం చిత్రంతో కథల ఎంపికలో తన పంథాను నాగార్జున మార్చుకున్న సంగతి తెలిసిందే. వైవిధ్యంతో కూడిన కథాంశాలకే ప్రాధాన్యతనివ్వాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా.. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా కల్యాణ్‌కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

రమ్యకృష్ణ, లావణ్యత్రిపాఠి హీరోయిన్స్. వినూత్న కథాంశంతో గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున తాతమనవడిగా ద్విపాత్రాభినయంలో నటించనున్నట్లు సమాచారం. రెండు పాత్రలు సరికొత్త పంథాలో సాగుతాయని చిత్రబృందం చెబుతోంది. వినోదం, కుటుంబ అనుబంధాల సమాహారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా మైసూర్‌లో ప్రారంభమైంది.

హీరో,హీరోయిన్స్ లతో పాటు చిత్ర తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. హంసానందిని, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. బ్రహ్మానందం, హంసానందిని, చలపతిరావు, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌

English summary
Nagarjuna Launches Cancer Support Group At KIMS Hyderabad.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu