For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘...రాంబాబు’తో పోటీ గురించి నాగార్జున

  By Srikanya
  |

  హైదరాబాద్ : 'సంక్రాంతికి 3, 4 పెద్ద సినిమాలు వస్తుంటాయి. అప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకొస్తుంది. ఇది దసరా పండుగ సీజన్ కదా. సినిమా నచ్చితే ప్రేక్షకులు ఎన్నయినా చూస్తారు' అన్నారు నాగార్జున. 'డమరుకం' సినిమా కన్నా ఒక రోజు ముందు 'కెమెరామెన్ గంగతో రాంబాబు'వస్తోంది. ఇలా ఒకే సమయంలో రెండు పెద్ద సినిమాలు వస్తే థియేటర్ల కొరత రాదంటారా? అని నాగార్జునని ప్రశ్నిస్తే ఇలా సమాధానమిచ్చారు. త్వరలో దసరా హడావిడి మొదలుకాబోతోంది. దసరా శెలవులను తమ సినిమాలతో కలర్ ఫుల్ గా చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

  అంతేకాదు బాలీవుడ్, హాలీవుడ్ తరహాలో ఎక్కువ థియేటర్లలో సినిమా విడుదల చేయడం మంచిదే. ఈ పైరసీని తట్టుకోవాలంటే అదొక్కటే మంచి మార్గం. ఇప్పుడు ఏ సినిమా అయినా ఆడేది నాలుగైదు వారాలే. గతంలో లాగా 90 వేలు పెట్టి ప్రింట్ వేయక్కర్లేదు. దాదాపుగా అన్ని థియేటర్లూ డిజిటల్‌మయం అయిపోయాయి కాబట్టి, పెద్దగా ఖర్చు కూడా అనిపించడంలేదు అన్నారు. నాగార్జున 'డమరుకం' , పవన్ కళ్యాణ్ 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' చిత్రాలు ఈ దసరాకు విడుదల అవుతున్నాయి. మరికొన్ని చిన్న సినిమాలు ఉన్నా వారం తేడాలో వచ్చే ఈ రెండు సినిమాలే మాగ్జిమం ధియోటర్స్ లో ప్రేక్షకుడుకి కనపించి అలరించనున్నాయి.

  అలాగే 'డమరుకం' సిజి వల్లే ఆలస్యం అయ్యింది. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలోని 'డమరుకం' చిత్రీకరణ పూర్తయింది. అయితే కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ వల్ల రిలీజ్‌ ఆలస్యమైంది. నిర్మాత ఆర్‌.ఆర్‌.వెంకట్‌ రాజీ లేకుండా ఖర్చు చేస్తున్నారీ సినిమాకి. సోసియోఫాంటసీ కథలో మాస్‌ మసాలాను అద్భుతంగా మిక్స్‌ చేసి దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. నా 25ఏళ్ల కెరీర్‌లో ఎవరూ చేయని కొత్త తరహా చిత్రమిది. 2012నాటికి ప్రపంచం ఉండదు..అనే కాన్పెప్టుతో హాలీవుడ్‌ సినిమాలెన్నో వచ్చాయి. ఆ తరహా చిత్రమిది. గ్రహాల తీరుపెై స్పృషించారు. బొట్టు శీను తరహా మాస్‌ పాత్ర మరో హైలెైట్ అని చెప్పారు.

  నాగార్జున దసరాకి 'డమరుకం' ఓ రేంజిలో మోగించబోతున్నారు. అనూష్క హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం ట్రైలర్స్ ఇప్పటికే రిలిజ్ అయ్యి అంతటా మంచి టాక్ క్రియేట్ చేస్తున్నాయి. అలాగే ఆడియోలో సక్కుబాయి అంటూ ఛార్మి చేసిన ఐటం సాంగ్ కు మంచి క్రేజ్ వచ్చింది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ కథలో విజువల్‌ ఎఫెక్ట్స్‌కి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. సాంకేతిక విభాగంలో విదేశీ నిపుణుల సహకారం కూడా తీసుకొన్నారు. ''సాంకేతికంగా ఉన్నత విలువలతో తీర్చిదిద్దిన సినిమా ఇది. గ్రాఫిక్స్‌ అబ్బురపరుస్తాయి. పతాక సన్నివేశాలు ఉత్కంఠ రేకెత్తిస్తాయి'' అని దర్శకుడు శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు.

  ఇక "రాంబాబుగా కల్యాణ్, గంగగా తమన్నా చాలా గొప్పగా చేశారు. నంది, ఫిల్మ్‌ఫేర్ వంటి అవార్డుల్ని వారి చేతుల్లో పెట్టాల్సిందే'' అన్నారు పూరి జగన్నాథ్. పవన్‌కల్యాణ్ హీరోగా ఆయన డైరెక్ట్ చేసిన 'కెమెరామన్ గంగతో రాంబాబు' సినిమా ఈ నెల 18న అత్యధిక ప్రింట్లతో విడుదల కాబోతోంది. యూనివర్సల్ మీడియా పతాకంపై ఎస్. రాధాకృష్ణ సమర్పణలో డి.వి.వి. దానయ్య నిర్మించారు.

  English summary
  
 Damarukam have finally addressed the film's release concerns as they officially announce it as October 19. Camera man gangato rambabu is planning to release on 18th October. Tollywood movies flooded with very tough competition in this Dussera season.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X