»   » రాజుగారి గదిలో చిలిపిగా నాగార్జున.. పాండిచ్చేరిలో ఇలా..

రాజుగారి గదిలో చిలిపిగా నాగార్జున.. పాండిచ్చేరిలో ఇలా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ టెలివిజన్ యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో రూపొందున్న రాజుగారి గది2 చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంటున్నది. ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ పాండిచ్చేరిలో పూర్తి చేసుకొన్నది. నటసమ్రాట్ నాగార్జునపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్ర షూటింగ్ వివరాలను నాగార్జున ట్విట్టర్ వెల్లడించారు. సినిమాకు సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేశారు.

రాజుగారి గది ఓ కొత్త అనుభూతి

రాజుగారి గది ఓ కొత్త అనుభూతి

రాజుగారి గది షూటింగ్ ఓ కొత్తరకమైన అనుభూతిని కలిగించింది. షూటింగ్ చాలా సూపర్బ్‌గా జరిగింది అని నాగార్జున ట్వీట్ చేశారు. పాండిచ్చేరి సముద్ర ఒడ్డున ఉన్న బ్యారేజిపై నాగార్జున బైక్ నడిపే చిత్రాలను షూట్ చేశారు.

సీరత్‌తో రొమాంటిక్‌గా నాగ్

సీరత్‌తో రొమాంటిక్‌గా నాగ్

నాగార్జునకు జంటగా రన్ రాజా రన్ ఫేం సీరత్ కపూర్ నటిస్తున్నారు. నాగార్జున, సీరత్ కపూర్‌పై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు షూట్ చేసినట్టు ట్విట్టర్‌లో పెట్టిన ఫోటోలతో స్పష్టమైంది. రాజుగారి గది2 షూటింగ్ పూర్తిచేసుకొని హైదరాబాద్‌కు తిరిగివచ్చాను అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఫీల్ గుడ్ మూవీ..

ఫీల్ గుడ్ మూవీ..

ఊపిరి, సోగ్గాడే చిన్నినాయ‌నా త‌ర‌హాలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఊపిరి క‌థ విన్నప్పుడు ఎలా ఫీల‌య్యానో `రాజుగారి గ‌ది2` క‌థ విన‌గానే ఎప్పుడెప్పుడు సినిమా చేయాలా అనిపించింది. ఈ సినిమాలో మ‌నుషుల‌తో అడుకునే క్యారెక్ట‌ర్ చేస్తున్నాను. తెలుగు ప్రేక్ష‌కులు సినిమాను ఆద‌రిస్తార‌ని న‌మ్మ‌కం ఉంది ఇటీవల మీడియాకు నాగార్జున వెల్లడించిన సంగతి తెలిసిందే.

 కొత్తగా నాగార్జున

కొత్తగా నాగార్జున

రాజుగారి గదిలో ప్రేక్షకులు ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌ని విధంగా నాగార్జునను దర్శకుడు ఓంకార్ ప్రజెంట్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత పివిపి నాగార్జున ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బ‌ట్టుకునేందుకు ఓంకార్ తీవ్రంగా శ్రమిస్తున్నట్టు సమాచారం.

English summary
Nagarjuna Akkineni shares his latest movie Raju Gari Gadhi2 Shooting experiences. He tweeted that On my way back to Hyderabad after a superb shoot for Raju Gari Gadhi2 in Pondycherry!!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu