»   » వెంకటేష్ నాగార్జునా ఒకే సినిమాలో..ఇది నిజమే

వెంకటేష్ నాగార్జునా ఒకే సినిమాలో..ఇది నిజమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగ్ వెంకీ ల కాంబినేషన్ లో ఒక సినిమా అభిమానులకి ఆశ్చర్యమే కాదు.. ఆనందం కూడా కలిగించే వార్త ఇది. ఈ ఇద్దరి కలిసి ఒకే సినిమాకి పని చేయటం అంటే మాటలా...అసలు ఇప్పటివరకూ ఎవరూ ఆ ఇద్దరినీ కలిసి పని చేయమని అడిగే సాహసం చేయలేకపోయారు... కానీ ఇన్నాళ్ళకి నాగ చైతన్య ఆ పని చేయగలిగాడు. అటు మామనీ ఇటు నాన్ననీ ఒకే సినిమాకి పని చేసేలా ఒప్పించాడు..

మలయాళ లవ్ స్టోరీ ప్రేమం సినిమా ని తెలుగు లో తీస్తున్న నాగ చైతన్య ఈ సినిమా మీద మొదటి నుంచే చాలా అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకి ప్రమోషన్ గట్టిగ ఉండాలి ప్రతీ ఎలిమెంట్ ప్రేక్షకులకి ఎగ్జైట్మెంట్ కలిగించేలా ఉండాలి.అందుకే అలాంటి ఏ చాన్స్ నీ వదులుఇకొవటం లేదు నాగ చైతన్య.

Nagarjuna and Venkatesh together for Naga Chaitanya?

ఈ సినిమా లో కామ్యో రోల్ లో వెంకటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కి మరొక హై లైట్ గా నాగార్జున వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు అని అంటున్నారు. నాగార్జున - వెంకటేష్ లు ఇద్దరూ కలిసి ఈ సినిమా హైప్ ని అమాంతం పెంచేసే లా కనిపిస్తున్నారు.

ఎంతోకాలం గా చైతూ కి సరైన హిట్ పడలేదు. ఇప్పుడా లోటుని ప్రేమం తో సమం చేయాలను కుంటున్నాడు ఈ అక్కినేని నటవారసుదు. ఆగస్ట్లో సినిమాని ప్రేక్షకుల ముందుకి తేవాలనుకుంటున్న ప్రేమం ఫైనల్ షెడ్యూల్ షూట్ గోవాలో జరగనుంది. ఏదేమైనా నాగార్జున - వెంకటేష్ కలిసి ఒకే సినిమా లో కీలక రోల్స్ ప్లే చేస్తూ ఉండడం తో ఈ సినిమాకి మంచి ప్లస్ అవబోతోంది. సో...! చైతూ ఖాతాలో హిట్ ఖాయం అన్నమాటే...

English summary
we will see King Nagarjuna and Victory Venkatesh in the film premam. They are to play little cameos in the movie...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu