»   » నాగార్జున తరుణ్ కు సాయం చేసాడంటూ ప్రచారం... ఆయన చేసిన సాయం ఇదే!

నాగార్జున తరుణ్ కు సాయం చేసాడంటూ ప్రచారం... ఆయన చేసిన సాయం ఇదే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో నాగార్జున... హీరో తరుణ్ కు సాయం చేస్తున్నాడంటూ ప్రచారం మొదలైంది. ఈ ఫేడెడ్ హీరోకి నాగార్జున చేసిన సాయం ఏమిటీ అని ఆరా తీస్తే చివరకు తేలిన విషయం ఇది.

నాగ్ చేసిన ఈ సాయం మరేదో కాదు.... తరుణ్ నటించిన మూవీ టీజర్ రిలీజ్ చేయడమే. వెండితెరపై క్రమక్రమంగా కనుమరుగవుతున్న హీరో తరుణ్ కి నాగార్జున చేసిన సాయం ఏంతో కొంత సహాయ పడుతుందని ఆంటున్నారంతా.

ఇది నా లవ్ స్టోరీ

ఇది నా లవ్ స్టోరీ

అభిరామ్ స‌మ‌ర్ప‌ణ‌లో రామ్ ఎంట‌ర్‌టైన‌ర్స్ బేన‌ర్‌పై త‌రుణ్‌, ఓవియా హీరో హీరోయిన్లుగా రమేష్‌, గోపి ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.వి.ప్ర‌కాష్ నిర్మిస్తోన్న చిత్రం `ఇది నా ల‌వ్‌స్టోరీ`. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ కింగ్ నాగార్జున చేతుల మీదుగా శుక్రవారం జరిగింది.

నాగార్జున మాట్లాడుతూ

నాగార్జున మాట్లాడుతూ

ఈ సంద‌ర్భంగా నాగార్జున మాట్లాడుతూ - ```ఇది నా ల‌వ్‌స్టోరీ, టైటిల్ చాలా బావుంది. టీజ‌ర్ చాలా ఫ్రెష్‌గా ఉంది. త‌రుణ్ లుక్ అంద‌రికీ న‌చ్చుతుంది. ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, హీరో త‌రుణ్‌కు మంచి సినిమా కావాల‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్ టీంకు అభినంద‌న‌లు`` అన్నారు.

రీమేక్

రీమేక్

చిత్ర నిర్మాత ఎస్‌.వి.ప్ర‌కాష్ మాట్లాడుతూ - ``క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో `ఇది నా ల‌వ్‌స్టోరీ` అనే పేరుతో రీమేక్ చేశాం. ఒక అమ్మాయిని ఎంత కాలం ప్రేమించామ‌నేది ముఖ్యం కాదు, ఎంతగా ప్రేమించామనేదే మ‌ఖ్యం ..అనేదే ఈ సినిమా మెయిన్ క‌థాంశం అని తెలిపారు.

తెలుగు వారికి నచ్చేలా

తెలుగు వారికి నచ్చేలా

తెలుగు ఆడియెన్స్ టెస్ట్‌కు త‌గిన విధంగా, నెటివిటీకి అనుగుణంగా క‌థ‌లో మార్పులు చేర్పులు చేశాం. అవుటండ్ అవుట్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌రుణ్, ఓవియా అద్భుతంగా న‌టించారు. నాగార్జున‌గారు టీజ‌ర్‌ను విడుద‌ల చేసి మ‌మ్మ‌ల్ని అప్రిసియేట్ చేయ‌డం మాకెంతో ఎన‌ర్జీనిచ్చింది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తాం`` అన్నారు.

English summary
Tarun, Oviya starrer 'Idi Naa Love Story' is a romantic entertainer film directed by Ramesh Gopi, produced by AS Prakash and presented by Abhiram under Ram Entertainments Banner. The film has reached the last stage of post-production works. Nagarjuna has released the film's teaser today and he is pleased with visuals in it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu