»   » 'మాడ్' ప్రారంభించిన మాస్ నాగార్జున

'మాడ్' ప్రారంభించిన మాస్ నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూబ్లీహిల్స్‌లోని ఎస్‌వీఎం మాల్‌లో ఏర్పాటు చేసిన మాడ్ (మ్యూజిక్ ఆర్ట్స్ డ్యాన్స్) పాఠశాలను సినీ నటుడు నాగార్జున శనివారం ప్రారంభించారు. ఈ పంక్షన్ కు సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి, నాగార్జున కుమారుడు నాగచైతన్య హాజరయ్యారు. ఈ డాన్స్ స్కూల్ ను స్మిత అద్వర్యంలో నడుస్తుంది. మ్యూజిక్...ఆర్ట్స్...డ్యాన్స్ మూడింటినీ ఒకే చోట చేర్చి...ఆయా రంగాల్లో నిష్ణాతులైన పండితుల చేత శిక్షణ ఇచ్చే సంస్థలు సంస్ధ ఇదని ఆమె చెప్తున్నారు. ఈ సందర్భంగా స్మిత మాట్లాడుతూ... 'నగర యువతను దృష్టిలో పెట్టుకుని భారతీయ, పాశ్చాత్య సంగీత, నృత్య కళలకు ప్రోత్సాహం అందిస్తూ ఈ మ్యూజిక్, ఆర్ట్, డ్యాన్స్ పాఠశాలను ప్రారంభించాం. ఆయా రంగాల్లో ప్రముఖులైన వారితో ఇక్కడ శిక్షణ ఇప్పిస్తున్నాం. కూచిపూడి నృత్యాన్ని కిశోర్ మొసలికంటి, కథక్‌ను రాఘవ్ రాజ్‌భట్, మంగళ భట్‌లు నేర్పుతారు. కర్నాటక సంగీతాన్ని డీవీ మోహన్‌కృష్ణ, ప్రొఫెషనల్ సింగింగ్‌ను రామాచారి, వేదిక్ మంత్రాలను వెంకట రమణ శర్మలు నేర్పుతారు. ఇక ఇండియన్ కంటెంపరరీ డ్యాన్స్‌ను టెరెన్స్ ల్యూయిస్, బాలీవుడ్ డ్యాన్స్‌ను బాస్కో సీసర్ డ్యాన్స్ కంపెనీ, సల్సాను రమేశ్‌మాస్టర్, మార్షల్ఆర్ట్స్‌ను జాక్సన్ మాస్టర్ నేర్పుతారు. నగర యువతను ఈ మాడ్ తప్పకుండా ఆకట్టుకుంటుంది' అన్నారు. ఇక ప్రస్తుతం నాగార్జున పయినం అనే ధ్రిల్లర్ చేస్తున్నారు. ఆకాశమంత ఫేమ్ రాధామోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. అలాగే నాగచైతన్య.. అజయ్ భుయాన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయటానికి కమిటయ్యారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu