twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివాదంలో నాగ్ ‘డమరుకం’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కింగ్ నాగార్జున నటించిన భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ మూవీ 'డమరుకం' వివాదంలో చిక్కుకుంది. ఈ టైటిల్ తమదే అంటూ నవీన్ కళ్యాణ్ అనే ఫిల్మ్ మేకర్ వాదిస్తున్నారు. ఈ టైటిల్‌ని తాము 2008లోనే రిజిస్టర్ చేయించామని, అయితే అదే టైటిల్‌తో ఆర్ఆర్ మూవీ మేకర్స్ వారు నాగార్జునతో సినిమా రూపొందించారని ఆరోపిస్తున్నారు.

    వాస్తవానికి ఫిల్మ్ చాంబర్ రూల్ ప్రకారం ఓ టైటిల్ రజిస్టర్ చేయించి దాన్ని దాన్ని మూడు నెలల్లోపు ఏదైనా సినిమా వాడకపోతే దాన్ని వేరొకరికి ట్రాన్ఫర్ చేస్తారు. దీని గురించి నవీన్ కళ్యాణ్ మాట్లాడుతూ రూల్ ఉన్న మాట వాస్తవమే కానీ తాను నిర్మిస్తున్న చిత్రం 50% పూర్తయింది. అలాంటప్పుడు ఆ టైటిల్‌ని ఎలా వేరొక సినిమాకు ఎలా వాడతారని ప్రశ్నించారు.

    ఈ చిత్రం కోసం నవీన్ కళ్యాన్ ఇప్పటికే రూ. 60 లక్షల వరకు ఖర్చు చేసాడు. తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల సినిమా ఆగి పోయింది. టాలీవుడ్లో వినిపిస్తున్న మరో రూమర్ ఏమిటంటే...ప్రొడ్యూసర్ సురేష్ రెడ్డి నవీన్ కళ్యాణ్ ను సంప్రదించి కోర్టు బయట సెటిల్ మెంట్ ప్రతిపాదన తెచ్చాడని, రూ. కోటి ఇస్తానని ప్రామిస్ చేసాడని అంటున్నారు. అయితే సురేష్ రెడ్డి మాత్రం ఈ రూమర్లను ఖండించారు.

    డమరుకం చిత్రం నాగార్జున కెరీర్లోనే మొదటి ఫాంటసీ మూవీ. హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందించారు. ఆయన కెరీర్లోనే ఇది హై బడ్జెట్ మూవీ. అక్టోబర్ 12 న విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శివుడికీ, మనిషికీ మధ్య సాగే సోషియో ఫాంటసీ కథాంశం. అలాగని భక్తి, ఆధ్యాత్మికం తరహా విషయాలేవీ ఇందులో ఉండవు. పక్కా మాస్‌ సినిమా. 45 నిమిషాల పాటు గ్రాఫిక్స్‌ ఉంటాయి.

    నాగార్జున, అనుష్క, ప్రకాష్ రాజ్, గణేష్, వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, యంఎస్ నారాయణ, కృష్ణ భగవాన్, జీవా బ్రహ్మాజీ, అవినాష్, దేవన్, గిరిబాబు, రామరాజు, దువ్వాసి మోహన్, సమీర్, శ్రవణ్, రాజా శ్రీధర్, ప్రభు, కమల్, ప్రగతి రజిత, కవిత, గీతాంజలి, సత్యకృష్ణన్, ప్రియ, అభినయ, కల్పన, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: చోటాకె నాయుడు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కథ: వెలిగొండ శ్రీనివాస్, డాన్స్: రాజు సుందరం, సమర్పణ: కె. అచ్చిరెడ్డి, నిర్మాత: వెంకట్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి

    English summary
    Akkineni Nagarjuna's upcoming movie Damarukam, which is one of the most-awaited flicks of 2012, has now landed in a title controversy. Filmmaker Naveen Kalyan has alleged that he has been doing a movie with the same title, but the production house RR Movie Makers has allegedly used it for the King's film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X