»   »  శ్రీదేవి కూతురుతో అఖిల్‌కు లింక్.... స్పందించిన నాగార్జున!

శ్రీదేవి కూతురుతో అఖిల్‌కు లింక్.... స్పందించిన నాగార్జున!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తన కుమారుడు అక్కినేని అఖిల్ విషయంలో ప్రచారంలోకి వస్తున్న పుకార్లను నాగార్జున ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు. తాజాగా అఖిల్ రెండో సినిమా విషయంలో వచ్చిన రూమర్స్ ఆయన వెంటనే ట్విట్ట్ ద్వారా ఖండించారు.

'అఖిల్ కోసం శ్రీదేవి కూతురిని ఎంపిక చేసుకోవాలనుకుంటున్న నాగార్జున' అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు కావడంతో .... ఇది నిజం కాదని, ఇలాంటి పుకార్లు నమ్మవద్దని నాగార్జున ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Nagarjuna denies rumors on akhil 2nd movie

అఖిల్ తెరంగ్రేటం చేసిన తొలి సినిమా బాక్సాఫీసు వద్ద ఫెయిల్ కావడంతో.... అఖిల్‌ను హీరోగా నిలబెట్టేందుకు నాగార్జున స్వయంగా బాధ్యత తీసుకున్న సంగతి తెలిసిందే. అఖిల్ రెండో మూవీ తానే స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో నిర్మిస్తున్నారు.

అక్కినేని ఫ్యామిలీ సూపర్ హిట్ 'మనం' చిత్రానికి దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ను హీరోయిన్‌గా తీసుకుంటున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నాగార్జున స్పందిస్తూ అది నిజం కాదన్నారు.

English summary
Nagarjuna denies rumors on akhil 2nd movie. He said that Sridevi daughter not casting in Akhil movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu