»   » ఆశ్చర్యపోయానంటూ...ఆ రూమర్ ని ఖండించిన నాగార్జున

ఆశ్చర్యపోయానంటూ...ఆ రూమర్ ని ఖండించిన నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా అక్కినేని నాగార్జున, ఆయన పెద్ద కుమారుడు నాగచైతన్య కలిసి సినిమా చేయనున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఆ వార్తల సారాంశం ఏమిటంటే...ఈ సినిమా గతంలో అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి చేసిన 'మనం' తరహాలో ఉండబోతోందని, అంతేకాకుండా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో మొదటి సినిమా 'శతమానంభవతి'తోనే మంచి హిట్ అందుకున్న దర్శకుడు 'సతీష్ వేగేశ్న' ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారని. అయితే నాగార్జున ఈ విషయమై ఖండిస్తూ ట్వీట్ చేసారు.

'నేను, చైతన్య కలిసి సినిమా చేస్తున్నామనే వార్తలు వినబడుతున్నాయి. ఇది నాక్కూడా పెద్ద న్యూస్ లానే ఉంది' అంటూ ఆ వార్తల్లో వాస్తవం లేదని, అలాంటి ప్లాన్స్ ఏవీ లేవని ట్విట్టర్ ద్వారా తేల్చి చెప్పారు. ప్రస్తుతం నాగార్జున రాఘవేంద్ర రావు డైరెక్షన్లో చేసిన 'ఓం నమో వెంకటేశాయ' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు.

Nagarjuna denies rumours

శ్రీనివాసుడి పరమభక్తుడైన హథీరామ్ బాబా జీవిత కథకు ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహిస్తున్నారు. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఎ.మహేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ 16 శతాబ్దంలో కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవెంకటేశ్వరుని పరమభక్తుడిగా నీరాజనాలందుకున్న హాథీరామ్‌బాబా జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది. ఈ నెల 8న పాటల్ని విడుదల చేస్తున్నాం.

ఈ సినిమాలో వెంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క నటిస్తోంది. ప్రతి ఒక్కరిలోనూ భక్తిభావనలు పెంపొందించేలా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాం అన్నారు. జగపతిబాబు, ప్రగ్యాజైస్వాల్, విమలారామన్ తదితరులు నటిస్తున్నారు.


దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి, నాకు ఇదే చివరి సినిమా అవుతుందేమో తెలియదు కానీ...'ఓం నమో వెంకటేశాయ' చిత్రంలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. కానీ ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని నాగార్జున చెప్పారు.

English summary
Nagarjuna took to his Twitter account and denied latest rumours. “I am reading and hearing news that Chai and I are doing a film together again. Hmmm! This is news to me,” said Nagarjuna on his Twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu