»   » అఖిల్ కి కౌంటర్ వేసాడు

అఖిల్ కి కౌంటర్ వేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'మనం'లో అఖిల్‌ కనిపించేది 30 సెకన్లే. అది చూసి అంచనాకు రాలేం. 30 సెకన్ల వాణిజ్యప్రకటనలో అందరూ అందంగానే కనిపిస్తారు. పూర్తిస్థాయి హీరోగా ఎలా రాణిస్తాడో చూడాలి అంటున్నారు నాగార్జున. ఆయన రెండో కుమారుడు అఖిల్ హీరోగా లాంచ్ కాబోయే చిత్రం పై అంతటా ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో నాగార్జున పుత్రోత్సాహంతో ఇలా స్పందించారు.

అలాగే నవ్వుతూ... ''అఖిల్‌ మరో మహేష్‌ అవుతాడు.. అంటుంటే అంతకంటే ఆనందం ఉంటుందా? ఇంకొంతమంది చైతూకి పోటీ వస్తున్నాడా? అని అడుగుతున్నారు. చైతన్య సంగతి పక్కన పెట్టండి. అఖిల్‌కి పోటీగా నేనున్నాను కదా.? నన్ను దాటమనండి.అఖిల్‌కి తనపై తనకు నమ్మకం ఎక్కువ. చిన్నతనం నుంచి ఇలాగే కాన్ఫిడెన్స్‌గా ఉండేవాడు. అఖిల్‌ సినిమాకి నేనే నిర్మాత అని అన్నారు.

Nagarjuna fun counter to Akhil

ఇక "'మనం' రిలీజ్ చేసేటప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో, ఇప్పుడూ అంతే సంతోషంగా ఉన్నాను. ఫ్యామిలీలో అందరం హ్యాపీయే. కానీ ఈ విజయాన్ని చూడటానికి నాన్నగారు మా మధ్య లేకపోవడం బాధగా ఉంది. ఆ బాధ వల్లనేనేమో ఇంత పెద్ద విజయాన్ని కూడా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నా. ఏదేమైనా సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరుతోందని అంటున్నారు'' అని నాగార్జున అన్నారు.

నేనెప్పుడూ ఈ కోట్ల క్లబ్‌ను పట్టించుకోను. కలెక్షన్ల విషయంలో ఎప్పుడూ ఒకరిదే పై చేయి ఉండదు. మాలోనే ఎవరో ఒకరు ఆ కలెక్షన్స్‌ను దాటిపోవచ్చు. కానీ, ఎవరూ దాటలేనిది మాత్రం 'మనం' సినిమా. అవును. 'మనం' లాంటి సినిమా ఇంకెవరూ తీయలేరు. తెలుగులో ఇలాంటి సినిమా ఇక రాదు. తెలుగు సినిమాకు ఇదొక మైల్‌స్టోన్ అన్నారు. అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి నటించిన చిత్రం 'మనం'. ఇటీవలే విడుదలైన ఆ చిత్రం విజయవంతంగా దర్శితమవుతోంది.

English summary
Nagarjuna full happy with his son Akhil's entry with Manam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu