»   » 'దడ' దెబ్బకు భయపడ్డ నాగార్జున ఆపేసాడు

'దడ' దెబ్బకు భయపడ్డ నాగార్జున ఆపేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
నాగచైతన్య హీరోగా వచ్చిన 'దడ' చిత్రం డిజాస్టర్ టాక్ తేవటం నాగార్జునని బాగా కలవరపెట్టనట్లుంది.దాంతో తన కొడుకు తో దేవకట్టా తలపెట్టిన ఆటో నగర్ సూర్య చిత్రానికి ప్రస్తుతానికి నో చెప్పేసాడని తెలుస్తోంది.దేవకట్టాను పిలిచి ప్రస్తుతం యాక్షన్ చిత్రం చేయటం వద్దని కొంతకాలం పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పాడని తెలుస్తోంది.దాంతో అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్ళనున్న చిత్రం ఆగిపోయింది. ఈ విషయమై దేవకట్టా కూడా చాలా నిరాశతో ఉన్నట్లు చెప్తున్నారు.ఇక ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా చేస్తున్న బెజవాడ చిత్రం యాక్షన్ చిత్రం కావటంతో దాని ఫలితాన్ని బట్టి నిర్ణయిస్తారని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో నాగచైతన్య విజయవాడ ఆటో నగర్ ఏరియాకు చెందిన రౌడీగా కనపించనున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర అయాన్ రాండ్ పాపులర్ నవల.. ది పౌంటెన్ హెడ్ లోని హోవర్డ్ రోర్క్ పాత్రను పోలి ఉంటుందని దేవకట్టా చెప్తున్నారు. ఆటోనగర్ సూర్య పాత్ర హోవర్డ్ రోర్క్ పాత్రకు స్క్రీన్ పై యాక్షన్ వెర్షన్. ఎలక్ట్రికల్ బల్బ్ అనేది ఎంత పాజిబులో.. హోవర్డ్ రోర్క్ అనే పాత్ర భూమిపై అంతే సహజం.మనందరిలోనూ ఆ పాత్ర ఉంది అన్నారు. ఇక ఆ పాత్ర చాలా ఐడియలిస్ట్ గా ఉంటూ తాను నమ్మిన విలువలకు దేనికీ కాంప్రమైజ్ కాకుండా ఏం జరిగినా ఫరవాలేదు అన్న కోణంలో ముందుకెళ్తూంటాడు. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:దేవాకట్టా.
English summary
Nagarjuna has asked Dev Katta to "postpone" the action flck, "Autonagar Surya". Apparently, after the "Dhada" debacle, he doesn't want to give the green signal to another action film for his son. So, "Autonagar Surya", which was to hit the floors in October, is on the backburner for nరow.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu