»   » నాగార్జున స్పెషల్ ఫ్రెండ్, స్వీట్ హార్ట్: శ్రీయ ఇంటర్వ్యూ

నాగార్జున స్పెషల్ ఫ్రెండ్, స్వీట్ హార్ట్: శ్రీయ ఇంటర్వ్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా స్టార్ హీరోయిన్లలో శ్రీయ ఒకరు. దాదాపు అందరు అగ్రహీరోలతోనూ అమ్మడు నటించింది. టాలీవుడ్ స్టార్ నాగార్జున సపోర్టు ఇవ్వడం వల్లనే శ్రీయ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు అవకాశాలు తగ్గినప్పటికీ ఆమెకు ఉండే గుర్తింపు ఆమెకు ఉంది. అమ్మడి వయసు 32 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా... వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సినిమా రంగంలో తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోది. తాజాగా ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీయ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

ఈ ఇంటర్వ్యూలో మొదట తన బ్యాగ్రౌండ్ గురించి చెబుతూ..... తాము ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాయస్థా ఫ్యామిలీకి చెందిన వారమని, తన పూర్తి పేరు శ్రీయ సరాన్ భట్నాకర్ అని, తన తండ్రి పుష్పిందర్ సరాన్ బిహెచ్ఇఎల్ లో ఇంజనీర్ గా పని చేసి రిటైర్ అయ్యారని, తల్లి కెమిస్ట్రీ టీచర్ అని...తండ్రి వృత్తి రీత్యా హరిద్వార్ పనిచేయడం వల్ల తన బాల్యం ఇక్కడే సాగిందని చెప్పుకొచ్చింది శ్రీయ.

 Nagarjuna is my most special friend: Shriya Saran

కథక్ డాన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని, డాన్సర్ గా ఎదిగి వివిధ ప్రాంతాల్లో ప్రదర్శన ఇస్తుండగా తెలుగు ఫిల్మ్ మేకర్స్ దృష్టిలో పడ్డానని, అయితే తనకు మంచి బ్రేక్ వచ్చింది నాగార్జున వల్లే అని శ్రీయ చెప్పుకొచ్చింది. నాగార్జున నటించిన ‘సంతోషం' సినిమాలో నటించడం, ఆ సినిమా పెద్ద హిట్ కావడం కెరీర్ పరంగా కలిసొచ్చిందని శ్రీయ చెప్పుకొచ్చింది. తర్వాత రజనీకాంత్ ‘శివాజీ' సినిమాలో అవకాశం వచ్చిందని, సౌత్ లో నటించడం వల్ల అక్కడ నాలుగు భాషలు మాట్లాడగలను. ‘దృశ్యం' హిందీ వెర్షన్ నేను నటించిన బిగ్గెస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ అని శ్రీయ చెప్పుకొచ్చింది.

నాగార్జున గురించి మాట్లాడుతూ... నాగార్జున నాకు స్పెషల్ ఫ్రెండ్. స్వీట్ హార్ట్. తన సినిమాల్లో అవకాశం ఇవ్వడం ద్వారా నా కెరీర్ కు సపోర్టు ఇచ్చారు. ఆయన ఇంట్లో నాకు ఎప్పుడూ స్వేచ్ఛ ఉంటుంది. ఆయన ఇద్దరు కుమారులు, భార్య అమల నాకు మంచి ఫ్రెండ్స్ అని శ్రీయ చెప్పుకొచ్చింది.

వ్యక్తిగత జీవితం ప్రయివేటుగా ఉండడమే ఇష్టం. డేటింగులు నాకు సరిపడవు. అందుకే ఎవరితోనూ ఇంతకాలంగా డేటింగ్ అనేదే చేయలేదు. అయితే నా గురించి జరిగిన ప్రచారం వేరే. నేను నటించిన ప్రతిహీరోతోనే లింకులు అంటగట్టేశారు. హీరోలతో కాఫీలకు పబ్బులకు వెళ్లినంత మాత్రాన అది డేటింగ్ కాదు. నన్ను అర్థం చేసుకునే వాడు దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది శ్రీయ.

English summary
"Nagarjuna is my most special friend. He is a sweetheart. He picked me up from nowhere for his film. His house is an open house for me. I know both his sons well as well as his wife who is also my friend. She introduced me to Vipassana." Shriya Saran told to TOI.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu