For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రూమర్సే అని కొట్టిపారేసిన నాగార్జున

  By Srikanya
  |

  హైదరాబాద్ : నాగార్జున ప్రస్తుతం మైసూర్ లో సోగ్గాడే చిన్ని నాయినా చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే రీసెంట్ గా ఆయన కన్నడ చిత్రం మైత్రి చూసారని, ఆ రీమేక్ లో చేయబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అవి రూమర్స్ అని ఆయన కొట్టిపారేసారు. తాను ఆ సినిమా చేయటం లేదని అన్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  నాగార్జున మైసూర్ లోని మీడియాతో మాట్లాడుతూ..."నేను పునీత్ రాజకుమార్ నటించిన మైత్రి చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. సినిమాలో సమాజానికి చాలా మెసేజ్, విలువలు ఉన్నాయి. అయితే నేను నటిస్తున్నానంటూ కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అలాంటిదేమీ ప్రస్తుతానికి ఏమీ లేదు ", అన్నారాయన.

  కన్నడంలో ఫిబ్రవరి 20న విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి టాక్ తెచ్చుకుంది. గిరి రాజ్ దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మోహన్ లాల్, పునీత్ రాజకుమార్ నటించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రం కన్నడ,మళయాళ వెర్షన్ లలో మంచి పేరు తెచ్చుకుని కలెక్షన్స్ కురిపిస్తోంది. ఈ చిత్రంలో రియాలిటీ క్విష్ షో(మీలో ఎవరు కోటీశ్వరుడు తరహా) నడిపే హీరోగా పునీత్ కనిపించారు. దాంతో నాగార్జున ఈ చిత్రం చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.

  Nagarjuna isn’t doing “Mythri” remake

  కన్నడ చిత్రం కథ విషయానికి వస్తే...జువైలరీ హోమ్ లో ఉంటే ...సిద్దరామ అనే కుర్రాడు...హీరో పునీత్ రాజ్ కుమార్ కి వీరాభిమాని. దాంతో పునీత్ ...నిర్వహిస్తున్న టీవి షోలో ..సిద్దరామ పాల్గొని...యాభై లక్షలు గెలుచుకోబోతాడు.అదే సమయంలో పునీత్ కు మహదేవ్( మోహన్ లాల్) అనే DRDO సైంటిస్టు నుంచి ఓ రిక్వెస్టు వస్తుంది. సిద్దరామని విన్నర్ గా చేయవద్దని కోరుతాడు. మాధవ్ చెప్పేదేమిటంటే... సిద్దరామ తన కుమారుడుని చంపేసాడు అని. ఆ సంఘటన వెనక ఓ టచింగ్ స్టోరీ ఉంటుంది.

  సిద్దరామ... గోలీ ప్రకాష్(రవికాలే) నడిపే చైల్డ్ ట్రాఫికింగ్ రాకెట్ లో ఓ విక్టిమ్. అక్కడ నుంచి కథ ఓ డ్రమిటిక్ టర్న్ తీసుకుంటుంది. సిద్దరామ..తన తదుపరి ప్రశ్నకు జవాబు ఇవ్వటానికి మహాదేవ్ సాయం అడుగుతాడు. అది విన్ అయితే కోటి వస్తుంది. ఆ డబ్బుని...రవి ప్రకాష్(అతుల్ కులకర్ణి) కి ఇచ్చి తాను ఉంటున్న రిమేండ్ హోమ్ ని బాగు చేయమని అడుగుతాడు. అసలు సిద్దరామ...ఎందుకు జైలుకు వెళ్లాడు. మోహన్ లాల్ కొడుకుని అతను చంపటానకి కారణం ఏమిటి... దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటి అనేది ..సోషల్ మెసేజ్ తో నడిచే కథనం.

  నాగార్జున ప్రస్తుతం చేస్తున్న చిత్రం విశేషాలకు వస్తే...

  నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'. లావణ్య త్రిపాఠి కథానాయిక. రమ్యకృష్ణ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. కల్యాణ్‌కృష్ణ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం మైసూర్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాగార్జున రెండు పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది.

  ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో హాట్ హీరోయిన్ హంసా నందిని నటిస్తుంది. కొన్ని రోజులు షూటింగులో కూడా పాల్గొంది. తన పాత్ర వివరాలు వెల్లడించలేనని, నేను గతంలో నటించిన పాత్రల కంటే భిన్నమైన పాత్ర అని హంసా తెలిపింది. దర్శకుడు కథ చెప్పిన వెంటనే అంగీకరించిందట.

  లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం స్వామిజీగా వినోదం పండిస్తారని సమాచారం. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా' నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత. ‘హలో బ్రదర్' తరహాలో వినోదాత్మక సినిమా అని సమాచారం.

  ''వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందుతున్న చిత్రమిది. నాగార్జున ప్రయాణంలో మరొక ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుంది''ని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ఇటీవల రామోజీ ఫిల్మ్‌ సిటీలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. బ్రహ్మానందం, హంసానందిని, చలపతిరావు, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌

  English summary
  “I’m very impressed with Puneeth Rajkumar’s Mythri. The film lots of values and messages to the society. Though there are rumours doing rounds that I’m starring in the film’s remake, nothing has been finalized yet”, said Nagarjuna, while speaking to media at Mysore.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X