twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్ , కార్తీ కాంబినేషన్ చిత్రం ప్రారంభం (ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్: నాగార్జున,కార్తీ హీరోలుగా పివిపి పతాకంపై వంశీ పైడిపల్లి దర్సకత్వంలో ప్రసాద్ వి. పొట్లూరి ప్రొడక్షన్ నెంబర్ 9గా నిర్మిస్తున్న మల్టిస్టారర్ మూవి బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది.

    తెలుగు,తమిళ భాషల్లో భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంభందించిన తమిళ వెర్షన్ ప్రారంభోత్సవం పిభ్రవరి 28న చెన్నైలో గ్రాండ్ గా జరగనుంది. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తగినట్లే భారి నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
    అక్కినేని నాగార్జున, కార్తీ కలయికలో పివిపి సినిమాస్‌ ఈ భారీ మల్టీస్టారర్‌కి సన్నాహాలు చేస్తోంది. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. అత్యున్నత సాంకేతిక విలువలతో, రాజీ లేకుండా తెరకెక్కించడానికి పివిపి సంస్థ సిద్ధమవుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఇతర వివరాల్ని వెల్లడించనున్నారు. ‘మనం' చిత్రంతో నాగార్జున, ‘మద్రాసు' చిత్రంతో కార్తీ విజయాలు సొంతం చేసుకుని చాలా హుషారులో ఉన్నారు కాబట్టి మార్కెట్‌ పరంగా రెండుచోట్లా భారీ క్రేజు ఏర్పడుతుందని అంతా అంచనాలు వేస్తున్నారు.

    ప్రారంభోత్సవం చిత్రాలు స్లైడ్ షో లో...

     తొలిషాట్ కు...

    తొలిషాట్ కు...

    నాగార్జున, కార్తీలపై చిత్రీకరించిన తొలి షాట్ కుఅమల క్లాప్ ఇచ్చారు.

    కెమెరా స్విచ్చాన్

    కెమెరా స్విచ్చాన్

    పివిపి సతీమణి ఝూన్సీ రాణి సురెడ్డి కెమెరా స్విచ్చాన్ చేసారు.

    ఫస్ట్ షాట్ డైరక్షన్

    ఫస్ట్ షాట్ డైరక్షన్

    ఫస్ట్ షాట్ ని వంశీ పైడిపల్లి సతీమణి శ్రీమతి మాలిని పైడిపల్లి డైరక్ట్ చేసారు.

    నాగార్జున మాట్లాడుతూ...

    నాగార్జున మాట్లాడుతూ...

    వంశీ కథ చెప్పగనే చాలా ఎక్సైట్ అయ్యాను. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చేస్తానా అనే క్యూరియాసిటీ కలిగింది. ఈ మధ్యకాలంలో నేను విన్న మంచి సబ్జెక్టు ఇది. డెఫినిట్ గా ఇది డిఫరెంట్ మల్టిస్టారర్ అవుతుంది. ఈ చిత్రాన్ని పివిపి చాలా హై లెవిల్ లో ప్లాన్ చేసారు. చాలా తర్వాత తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని నిర్మించండంవిశేషం.

    కార్తీ మాట్లాడుతూ...

    కార్తీ మాట్లాడుతూ...

    నేను తమిళ్ లో చేసిన చిత్రాలన్నీకూడా తెలుగులో పెద్ద హిట్ అయ్యాయి. నేను ఫస్ట్ టైమ్ తెలుగులో చేస్తున్న స్ట్రైయిట్ మూవి, తమిళంలో కూడా నిర్మించండ హ్యాపీగా ఉంది. తెలుగులో నా ఫస్ట్ మూవి నాగార్జున వంటి పెద్ద హీరోతో, పివిపి వంటి పెద్ద సంస్ధలో చేయటం ఆనందంగా ఉంది. ఈ సినిమా తప్పకుండా తెలుగు, తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది అన్నారు.

    సంగీత దర్శకుడు గోపీ సుందర్ మాట్లాడుతూ...

    సంగీత దర్శకుడు గోపీ సుందర్ మాట్లాడుతూ...

    బెంగుళూర్ డేస్ చిత్రాన్ని పివిపి గరు రైట్స్ తీసుకుని ఆ చిత్రంలోని మ్యూజిక్ ఆయనకు బాగ నచ్చటంతో తెలుగులో కూడా సంగీతం చేసే అవకాసం నాకే ఇచ్చారు. ఈ మధ్య విడుదలైన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది . నాగార్జున గారు, కార్తీ గారు చేస్తున్న ఈ సినిమాతో తెలుగులో నాకు మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నాను అన్నారు.

    వంశీ పైడిపల్లి మాట్లాడుతూ....

    వంశీ పైడిపల్లి మాట్లాడుతూ....

    నాగార్జున గారు, కార్తీ గరు ఈ సినిమా చేయటానికి అంగీకరించమే సగం విజయం లభించినట్లు ఫీల్ అవుతున్నాను. ఈ కథకు నాగార్జునగారు, కార్తీగరు హండ్రెడ్ పర్శెంట్ ఫెరఫెక్ట్ గ సూట్ అవుతారు. నాగార్జున గారితో నేను చేస్తున్న తొలి సినిమా ఇది.

    అలాగే....

    అలాగే....

    కార్తీగారు ఫస్ట్ టైమ్ తెలుగులో చేస్తున్న స్ట్రైయిట్ మూవికి నేను దర్సకత్వం వహించండ హ్యాపీగా ఉంది. నా మీద నమ్మకంతో చిత్రం ద్వారా తమిళ్ లో నన్ను డైరక్ట్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్న పివీపి గారికి ధన్యవాదాలు. పీవీపి లాంటి పెద్ద సంస్ద నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుందే నమ్మకం నాకు ఉంది అన్నారు వంశీ పైడిపల్లి.

    షెడ్యూల్

    షెడ్యూల్

    మార్చి 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే ఈ చిత్రం జూన్ నెలాఖరుకు పూర్తవుతుంది

    ఎక్కడెక్కడ

    ఎక్కడెక్కడ

    హైదరాబాద్, చెన్నై లతో పాటు విదేశాలలో కూడా ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది.

    ఎవరెవరు

    ఎవరెవరు

    నాగార్జున, కార్తీ, శృతిహాసన్, జయసుధ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ఇంకా చాలా మంది ప్రముఖ నటీనటులు ఇతర పాత్రలు పోషిస్తారు.

    సినిమాటోగ్రఫీ

    సినిమాటోగ్రఫీ

    మనం లాంటి సూపర్ హిట్ చిత్రానికి సినిమాటోగ్రఫి అందించిన పి.ఎస్ వినోద్ ఈ చిత్రానికి కూడా ఫొటోగ్రఫీ చేస్తున్నారు.

    తెర వెనక

    తెర వెనక

    ఈ చిత్రానికి సంగీతం గోపీసుందర్, సినిమాటోగ్రఫీ పి.ఎస్ వినోద్, మాటలు అబ్బూరి రవి, కథ వంశీ పైడిపల్లి, హరి, సాల్మన్,

    ఇంకెవరు

    ఇంకెవరు

    ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు, నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి, స్క్రీన్ ప్లే దర్శ కత్వం వంశీ పైడిపల్లి

    English summary
    Nagarjuna and Tamil star Karthi are going to share screen space together for the first time in an upcoming Telugu –Tamil bilingual launched today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X