»   » దర్శకేంద్రుడి ప్లాన్, నాగార్జున కలియుగ దైవం పాత్రలో...

దర్శకేంద్రుడి ప్లాన్, నాగార్జున కలియుగ దైవం పాత్రలో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కలిసారంటే..... వెండితెరపై ఒక అద్భుతమైన భక్తిరస చిత్రం రావాల్సిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి చిత్రాలు మంచి విజయం సాధించాయి.

వీరి కాంబినేషన్ మరో భర్తిరస చిత్రం కాబోతోంది. ఈ సారి నాగార్జున శ్రీ వెంకటేశ్వర స్వామిగా కనిపించనున్న ఈ చిత్రానికి 'ఓం నమో వేంకటేశాయ' అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని స్వయంగా రాఘవేంద్ర రావునే నిర్మించతోతున్నట్టు సమాచారం.

Nagarjuna-Raghavendra Rao's film on Lord Venkateswara

రాఘవేంద్రరావు తిరుమల తిరుపతి దేవస్థాన సభ్యుడిగా ఇటీవల ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన శ్రీవెంకటేశ్వర స్వామిపై పై ఈ సినిమాను తెరకెక్కించాలనుకోవడం చర్చనీయాంశం అయింది. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థాన సభ్యుడిగా రాఘవేంద్రరావు ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో నాగార్జున కూడా పాల్గొన్నారు.

త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు ఏడుకొండల వాడి భక్తుడు ‘అన్నమయ్య' పాత్రలో అలరించిన నాగార్జున ఇపుడు ఏడు కొండల వాడి పాత్రలో కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి కూడా కీరవాణి సంగీతం అందించే అవకాశం ఉంది.

English summary
Film Nagar source said that, Nagarjuna-Raghavendra Rao's film on Lord Venkateswara.
Please Wait while comments are loading...