»   »  ఢమరుకం మ్రోగించడానికి సిద్దమైన కింగ్ నాగార్జున

ఢమరుకం మ్రోగించడానికి సిద్దమైన కింగ్ నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున, అనుష్క జంటగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న 'ఢమరుకం' చిత్రం షూటింగ్ శనివారం సాయంత్రం అన్నపూర్ణ స్టుడియోలో ప్రారంభమైంది. నాగార్జునపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అక్కినేని నాగేశ్వరరావు స్విచ్ ఆన్ చెయ్యగా, డా.డి.రామానాయుడు క్లాప్ నిచ్చారు. పూరి జగన్నాధ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ 'నేను ఎప్పట్నుంచో ఓ సోషియో ఫాంటసి చిత్రాన్ని చేయాలని అనుకుంటున్నాను. శ్రీనివాస రెడ్డి ఈ కధ చెప్పగానే నాకు ఎంతో నచ్చింది. గ్రాఫిక్స్ కు ఎక్కువ ప్రాధాన్యత వుండే ఈ చిత్రంలో నేను నాలుగైదు గెటప్స్ లో కనిపిస్తాను. నా మాటతీరు మాత్రం వెస్ట్ గోదావారి మాటతీరు లో వుంటుంది' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ 'నాగార్జున లాంటి అగ్ర కధానాయకుడితో, ఓ ప్రతిష్టాత్మక బ్యానర్ లో నాకు అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయడంలో ఎపుడూ ముందుండే నాగ్ ఈ అవకాశం ఇచ్చారు. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రానికి టాప్ మోస్ట్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు' అన్నారు. సోనుసూద్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

English summary
King Nagarjuna’s new socio fantasy film under the direction of Srinivasa Reddy likely to be titled as ‘Damarukam’. This 
 
 movie is going to produced by Venkat under RR Movie Makers Banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu