»   »  నాగార్జున ... బంగార్రాజుగా సందడి (ఫొటోలు)

నాగార్జున ... బంగార్రాజుగా సందడి (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :కెరీర్ ప్రారంభం నుంచీ చేసే ప్రతి కథ, పాత్ర కొత్తగా ఉండాలని తపించే హీరో నాగార్జున. అందుకే ఆయన ప్రయాణంలో వైవిధ్యమైన చిత్రాలెన్నో కనిపిస్తాయి. 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంతో బంగార్రాజుగా సందడి చేయబోతున్నారు నాగ్‌. ఆయన సరసన లావణ్య త్రిపాఠి నటిస్తోంది. రమ్యకృష్ణ ముఖ్యభూమిక పోషిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కల్యాణ్‌కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల మైసూర్‌లోని 1500 సంవత్సరాల క్రితం నాటి ఓ దేవాలయంలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఈ నెల 22 నుంచి హైదరాబాద్‌లో ప్రధాన తారాగణంపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు.

లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం స్వామిజీగా వినోదం పండిస్తారని సమాచారం. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా' నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత . ''వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందుతున్న చిత్రమిది. నాగార్జున ప్రయాణంలో మరొక ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుంది''ని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.

''రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపించబోతున్నారు నాగార్జున. బంగార్రాజుగా ఆయన పంచే వినోదాలు అందరినీ అలరిస్తాయ''అని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. బంగార్రాజు తరఫున అందరికీ ఉగాది శుభాకాంక్షలు... అంటూ నాగార్జున సినిమాలోని చిత్రాలని ట్వీట్‌ చేశారు. వాటిని మీరు ఇక్కడ చూడవచ్చు.

స్లైడ్ షోలో...ఆ ఫొటోలు..

వైవిధ్యం కోసం..

వైవిధ్యం కోసం..

మనం చిత్రంతో కథల ఎంపికలో తన పంథాను మార్చుకున్నారు నాగార్జున. వైవిధ్యంతో కూడిన కథాంశాలకే ప్రాధాన్యతనివ్వాలని నిశ్చయించుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా.

తాతా,మనవడుగా..

తాతా,మనవడుగా..

వినూత్న కథాంశంతో గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున తాతమనవడిగా ద్విపాత్రాభినయంలో నటించనున్నట్లు సమాచారం.

విన్నూతనంగా..

విన్నూతనంగా..

రెండు పాత్రలు సరికొత్త పంథాలో సాగుతాయని చిత్రబృందం చెబుతోంది. వినోదం, కుటుంబ అనుబంధాల సమాహారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ మైసూర్‌లో పూర్తైంది.

రేపటినుంచీ..

రేపటినుంచీ..

హైదరాబాద్ లో హీరో,హీరోయిన్స్ తో పాటు చిత్ర తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు.

కీలకపాత్రల్లో..

కీలకపాత్రల్లో..

ఈ చిత్రంలో హంసానందిని, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్న

మనం తర్వాత ..

మనం తర్వాత ..


నాగ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన మనం చిత్రం తర్వాత మరోసారి ఈ చిత్రానికి అనూప్‌రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

సోషియో ఫాంటసీ

సోషియో ఫాంటసీ


ఈ చిత్రం కొత్త తరహాలో జరిగే సోషియో ఫాంటసీ చిత్రం అని తెలుస్తోంది.

మన్మథుడుగా

మన్మథుడుగా

నాగార్జున ...తాతగా ...కనిపించే పాత్ర మన్మధుడుని గుర్తు చేస్తూ ప్లే బోయ్ లాగ నడుస్తుందని చెప్పుకుంటున్నారు

కామెడీ

కామెడీ


హలో బ్రదర్ తరహాలో ఈ ద్విపాత్రాభినయం కామెడీ పంచబోతోంది.

ఎవరెవరు...

ఎవరెవరు...

బ్రహ్మానందం, హంసానందిని, చలపతిరావు, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌

English summary
The stills of Nagarjuna's 'Soggade Chinni Nayana' film were released recently .Nag is playing a dual role in this movie. Here are the new stills of Bangarraju character. Lavanya Tripathi and Ramya Krishna will be seen opposite Nag in this movie. Kalyan Krishna is the director and Ram Mohan P is the producer.
Please Wait while comments are loading...