»   »  20 ఏళ్ళు వెనక్కి: నాగార్జున యంగ్ లుక్

20 ఏళ్ళు వెనక్కి: నాగార్జున యంగ్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘మనం' ఘనవిజయం తర్వాత అక్కినేని నాగార్జున నటిస్తున్న కొత్త చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా'. ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి (‘అందాల రాక్షసి' ఫేం) కథానాయికలుగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంతో కల్యాణ్‌కృష్ణ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘మనం' చిత్రానికి పనిచేసిన ఛాయాగ్రాహకుడు పి.ఎస్‌.వినోద్‌ ఈ సినిమాకీ వర్క్‌ చేస్తున్నారు.

 Nagarjuna's Soggade Chinni Nayana On Location Pic

ఈ చిత్రానికి సంబంధించిన ఆన్ లొకేషన్ ఫోటో ఒకటి రమ్యకృష్ణ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసారు. 50 ఏళ్ల పైచిలుకు వయసున్న నాగార్జున ఈ చిత్రంలో సూపర్ హాండ్సమ్ లుక్ లో కనిపించబోతున్నారు. ఆయన గత చిత్రాలు వారసుడు, నిర్ణయం, అల్లరి అల్లుడు చిత్రాల్లో ఎలా కనిపించారో ఈ చిత్రంలో అదే లుక్ తో నాగార్జున కనిపించబోతున్నారు.

ఈ చిత్రంలో నాగార్జున తాత మనవడిగా ద్విపాత్రాభినయంలో నటించనున్నట్లు సమాచారం. రెండు పాత్రలు సరికొత్త పంథాలో సాగుతాయని చిత్రబృందం చెబుతోంది. హంసానందిని, అనసూయ, బ్రహ్మానందం, హంసానందిని, చలపతిరావు, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్.

English summary
Chec out Nagarjuna's Soggade Chinni Nayana On Location Pic.
Please Wait while comments are loading...