For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'అలాగంటే లాగి తంతాను'ఘాటుగా నాగార్జున

  By Srikanya
  |

  హైదరాబాద్: 'నిర్మాత అంటే ఫాదర్ ఆఫ్ ఇండస్ట్రీ. ఆయన్ని క్యాషియర్ అంటే నేనొప్పుకోను. నేను కూడా నిర్మాతగా సినిమాలు తీశాను. నన్ను ఎవరైనా క్యాషియర్ అంటే లాగిపట్టి తంతాను' అన్నారు నాగార్జున. నిర్మాతను క్యాషియర్‌ను చేయడం వలనే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ''నేనూ నిర్మాతనే. అన్నపూర్ణ సంస్థలో పలు చిత్రాలు నిర్మించాను. అదే మాట నన్నంటే ఊరుకోను. సినిమాకు తండ్రి నిర్మాతే. ఈ చిత్రానికి వేరే సమస్యలు రాకపోతే లాభాలతో విడుదల చేసేవాళ్ల ము''అన్నారు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన 'ఢమరుకం' విడుదల పలుసార్లు వాయిదాపడింది. ఈ నెల 23న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇలా స్పందించారు.

  అలాగే తాను ఆర్.ఆర్.మూవీ మేకర్స్‌లో మరో సినిమా చేస్తానని అన్నారు. నిర్మాత వెంకట్‌గారు సినిమా విడుదల కోసం నిన్నటి వరకూ చేయని ప్రయత్నం లేదు. ఆయన నాకు ఫోన్ చేసి 'మిమ్మల్ని కలవాలంటే ఎలాగో వుంది సార్' అని బాధపడ్డారు. ఎంతో రిస్క్‌తీసుకొని భారీ బడ్జెట్‌తో వెంకట్‌గారు సినిమాను తెరకెక్కించారు.నాకు వెంకట్‌మీద ఎలాంటి కోపం లేదు. అంతేకాదు ఈ సినిమా విషయంలో ఎవరినీ తప్పుబట్టడానికి వీలులేదు. వీలును బట్టి ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థలో మరో సినిమా చేయడానికి నేను సిద్ధమే అని అన్నారు.


  ఇక 'చైతన్య' పేరుతో నేను తీసిన సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ సమయంలో కొంచెం బాధగా అనిపించింది. ఇప్పుడు నాగచైతన్య పుట్టిన రోజైన నవంబర్ 23న ఈ సినిమా విడుదలకావడం ఆనందంగా వుంది.
  సినిమాపై ఎన్ని అపవాదులు వచ్చినా విజయమే అన్నింటికీ సమాధానం చెబుతుందని నాగార్జున అన్నారు. సినిమా విడుదలలో ఇన్ని కష్టాలుంటాయని ఇప్పటివరకు తెలియలేదని చెప్పారు. ఈ పరిస్థితి చూస్తుంటే నాన్నగారి సినిమా'మురళీకృష్ణ'లోని 'అనుకున్నామని జరగవు అన్నీ..అనుకోలేదని ఆగవు కొన్ని..' పాట తనకు గుర్తుకు వస్తోందని నాగ్ వ్యాఖ్యానించారు.

  ''ఇప్పుడు ఆ భగవంతుడు ఆజ్ఞ ఇచ్చేశాడు. అందుకేనేమో ఆయనకు ఇష్టమైన కార్తీక మాసంలో విడుదల చేస్తున్నాం. ఈ సినిమా నుంచి నేను ఓర్పు, సహనం గురించి నేర్చుకున్నాను. ఏదైనా సమస్య వస్తే మేమున్నాం అంటూ సహాయపడటానికి చిత్ర పరిశ్రమ ఉందనే నా నమ్మకం మరోసారి నిజమైంది. దాసరి నారాయణరావు ఈ సినిమా విడుదల కావడానికి ఎంతగానో తోడ్పడ్డారు. శివప్రసాద్‌రెడ్డి, ప్రకాష్‌రాజ్‌, అలంకార్‌ ప్రసాద్‌ ఇలా మరికొంతమంది సహాయ సహకారాల వల్లే విడుదల చేస్తున్నాము''అన్నారు.

  English summary
  Nagarjuna spoke his mind on Damarukam. Speaking to media he said Damarukam taught him lot of lessons and he came to know the value of patience,persistence and perservance. He said all the obstacles surrounding Damarukam disappeared and now Damarukam will be delighting viewers on 23rd of this month.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X