»   »  అఫీషియల్: అఖిల్ ప్రేమలో పడ్డాడు!నాగ్ ఓకే, ఆమె ఎవరంటే

అఫీషియల్: అఖిల్ ప్రేమలో పడ్డాడు!నాగ్ ఓకే, ఆమె ఎవరంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున రెండో కుమారుడు అఖిల్ ప్రేమలో పడ్డారట. తొలి చిత్రం డిజాస్టర్ అవటంతో రెండో చిత్రం కోసం కథలు వింటూ స్క్రిప్టు తయారీలో బిజీగా ఉన్న అఖిల్ మనస్సు ఇప్పుడు తన ప్రేమిస్తున్న అమ్మాయిపై ఉంది. ఈ విషయాన్ని అఖల్ స్వయంగా తెలియచేసాడు. అఖిల్ క్లోజ్ సర్కిల్స్ లో అంతా...అఖిల్ కు ఎంగేజ్ మెంట్ అయ్యిందనుకుంటున్నారు. ఈ విషయం పబ్లిక్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయమై ఓ పాపులర్ ఆంగ్ల పత్రిక అఖిల్ తో మాట్లాడింది.

అఖిల్ మాట్లాడుతూ.. 'నిజమే...నేనో అమ్మాయిని ప్రేమిస్తున్నాను, అయితే ఎంగేజ్ మెంట్ మాత్రం కాలేదు, కేవలం మా తల్లి తండ్రలుకు పరిచయం చేసాను' అని తేల్చి చెప్పేశారు అఖిల్. అఖిల్ మనసు దోచింది ఎవరో కాదట.. ఆ అమ్మాయి ఫ్యామిలీ ఫ్రెండేనట. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? అని ప్రశ్నిస్తే.. పేరు, ఇతర వివరాలు మాత్రం చెప్పనంటున్నారు అఖిల్.

Akhil Akkineni

ఎందుకు చెప్పవు...చెప్పుచ్చు కదా అంటే... ఆ అమ్మాయి పబ్లిసిటీకి దూరంగా ఉంటుందని చెప్పారు. అది సరే...అఖిల్ ప్రేమ కథకి నాగార్జున, అమల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటే ఇచ్చేశారని చెప్తున్నారు.

ఆ అమ్మాయి ఫ్యామిలీ, నాగ్ ఫ్యామిలీ మధ్య ఎప్పట్నుంచో మంచి స్నేహం ఉందట. అయితే అఖిల్, ఆ అమ్మాయి ప్రేమించుకుంటున్న విషయం మాత్రం కుటుంబ సభ్యులకు తెలియదు. ఇటీవల ఆ విషయాన్ని తన తల్లిదండ్రులతో అఖిల్ చెప్పారట.

ఎప్పట్నుంచో తెలిసిన కుటుంబానికి చెందిన అమ్మాయి కావడంతో అఖిల్ ప్రేమని నాగ్, అమల ఓకే చేసారట. ఈ విషయాన్ని స్వయంగా అఖిలే చెప్పారు. ఇక ఆ అమ్మాయి గురించి వివరాలు అంటారా.., ఆ అమ్మాయి అప్‌కమింగ్ డిజైనర్ అనీ, న్యూయార్క్‌లో చదివిందనీ సమాచారం. అంటే త్వరలో అఖిల్ చేయబోయే చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ రెడీ అయ్యిందన్నమాట. బెస్టాఫ్ లక్ అఖిల్.

English summary
Akhil says, “She’s a family friend. I’ve known her for a long time. She’s very far removed from the public glare, so I’d like to keep her away from the media for as long as I can.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu