నాగార్జున-అమల పెళ్లి రోజు... ఇమ్రాన్ హస్మి సినిమా చేసారు!
ముంబై: నాగార్జునను పెళ్లాడిన తర్వాత అమల అక్కినేని దాదాపుగా సినిమాలకు దూరంగా ఉంటూనే ఉంది. అయితే అప్పుడప్పుడు కొన్ని చిత్రాల్లో గెస్ట్ రోల్స్ మాత్రం చేస్తోంది. ఆ మధ్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్' చిత్రంలో ఓ కీలకమైన పాత్ర పోషించిన ఆమె, అక్కినేని ఫ్యామిలీ మూవీ ‘మనం'లోనూ ఓ సీన్లో కనిపించారు. 2013లో హిందీలోనూ ఓ చిత్రంలో కనిపించారు.
తాజాగా అమల అక్కినేని మహేష్ భట్ తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ ‘హుమారి ఆధురి కహాని' చిత్రంలో నటించారు. బాలీవుడ్లో సీరియల్ కిస్సర్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఇమ్రాన్ హస్మి, విద్యాబాలన్, రాజ్ కుమార్ రావు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ డ్రామా. ఈ చిత్రంలో ఇమ్రాన్ హస్మి తల్లి పాత్రలో అమల నటించింది.

ఈ చిత్రం ఈ రోజు(జూన్ 12) గ్రాండ్‌గా విడుదలైంది. అయితే నాగార్జున-అమల పెళ్లి రోజును పురస్కరించుకుని హైదరాబాద్ లో గురువారం(జూన్ 11) ప్రత్యేకంగా షో వేసారు. నాగార్జున, అమల...ఇతర కుటుంబ సభ్యులు కలిసి ఈ చిత్రం వీక్షించారు.
ఈ విషయమై ఈ చిత్ర దర్శకుడు మోహిత్ సూరి మాట్లాడుతూ....అమల, నాగార్జున సర్ కోసం ప్రత్యేకంగా సినిమా ప్రదర్శించారు. వాళ్లకు సినిమా ఎంతో నచ్చింది. వారి నుండి ప్రశంసలు అందాయి అని తెలిపారు.


Click it and Unblock the Notifications











