»   » మా అమ్మను...స్వామీ తీసుకెళ్లిపో అని ప్రార్థించా,తీర్చాడు: నాగార్జున

మా అమ్మను...స్వామీ తీసుకెళ్లిపో అని ప్రార్థించా,తీర్చాడు: నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: '' మొదట సారి నేను అమ్మతో కలిసి తిరుమల వెళ్లా. వెంకటేశ్వరస్వామి నా ఇష్ట దైవం. ఇప్పటి వరకు ఆయన్ను మూడు కోర్కెలు కోరుకున్నా.. అన్నీ తీర్చాడు. మా అమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు చూడలేక.. స్వామీ తీసుకెళ్లిపో అని ప్రార్థించా. కొన్ని గంటల్లోనే తీసుకెళ్లిపోయాడు.

ఆ తర్వాత నాన్నగారి ఆఖరి సినిమా 'మనం' హిట్‌ అవ్వాలని మనసారా ప్రార్థించా. ఆ సినిమా సూపర్‌హిట్‌ అయింది. అన్నారు నాగార్జున. 'ఓం నమో వెంకటేశాయ' ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ఇలా స్పందించారు.


అలాగే...మంచి కుటుంబాన్ని ఇచ్చావు. ఇద్దరు పిల్లల్ని చల్లగా చూడు తండ్రి అని వేడుకున్నా. తిరుమలలో ఉండగానే తెలిసింది. మా ఇద్దరి పిల్లల కల్యాణం గురించి. ఇలా స్వామివారు నా కోర్కెలన్నీ తీర్చాడు. స్వామి తీర్చిన కొద్దీ కోర్కెల చిట్టా పెరుగిపోతోంది. శ్రీనివాసుడు ఎప్పుడూ నాతోనే ఉన్నట్లు అనిపిస్తుంటుంది. శ్రీరామదాసు, అన్నమయ్య, శిరిడిసాయి, ఇప్పడు 'ఓం నమో వెంకటేశాయ'లో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నా'' అని వివరించారు. ఈ సందర్బంగా చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.ఇక రాఘవేంద్రరావుకి, నాకు ఇదే చివరి సినిమా అవుతుందేమో తెలియదు కానీ... ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.కార్యక్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అమల, అనుష్క, ప్రజ్ఞాజైస్వాల్‌, నాగచైతన్య, అఖిల్‌, సంగీత దర్శకుడు కీరవాణి, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

English summary
Addressing at the audio launch ceremony of the film 'Om Namo Venkatesaya', Nagarjuan said his devotional bonding with the director K Raghavendra Rao is immense which can not be expressed in words. Terming his experience with the director as great, Nagarjuna has hailed the collective effort of the team.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X