»   » తెలుగువాళ్లు గర్వంగా ఎలా ఫీలవుతారో నాగార్జునకే తెలియాలి

తెలుగువాళ్లు గర్వంగా ఎలా ఫీలవుతారో నాగార్జునకే తెలియాలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగువాళ్లు గర్వంగా ఫీలయ్యే సినిమా 'గగనం' అని నాగార్జున అంటున్నారు. అయితే ఈ చిత్రం దర్శకుడు ఓ రాధా మోహన్ తమిళియన్. దాంతో తమిళ దర్శకుడు తీసిన సినిమాలు తెలుగువాళ్ళు ఏం చూసుకుని గర్వపడాలి అనే సందేహం సగటు ప్రేక్షకుడుకి కలుగుతోంది. ఈ చిత్రం ఫిబ్రవరి నాలుగవ తేదిన విడుదల కావటంతో ఈ చిత్రం యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా నాగార్జున అలా స్పందించారు. అలాగే...ఇది యాక్షన్ నేపథ్యంలో రూపొందిన థ్రిల్లింగ్ డ్రామా. విమానం హైజాక్‌కు గురైతే ఆ విమానంలో ఉన్న ప్రయాణీకుల మానసిక స్థితి ఎలా ఉంటుంది, భిన్న మనస్తత్వాల మనుషుల మధ్య ఎలాంటి డ్రామా నడుస్తుంది, కమాండోలు ఏం చేస్తారు? ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది వంటి వాటిని దర్శకుడు బాగా అధ్యయనం చేసి, ఈ కథ రాశారు అన్నారు.

అలాగే గగనంలో తన పాత్ర గురించి నాగార్జున మాట్లాడుతూ...కమాండోగా చేస్తున్నా. టెర్రరిజాన్ని రూపు మాపడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ టీమ్‌కు బాస్‌ని నేను. ఫ్లైట్‌ హైజాగ్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. విమానాన్ని హైజాగ్‌ చేసిన టెర్రరిస్టుతో ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు విఫలమవుతాయి. ఆ తర్వాత కమాండోలు ఏం చేశారు..? అనే ఆసక్తికర కథాంశంతో కథ సాగుతుంది. ఇందులోని కొన్ని సన్నివేశాలు కాందహార్‌ ఇన్సిడెంట్‌ను పోలి వుంటాయి. ఇందులో స్క్రీన్‌ప్లే హైలైట్‌ అని చెప్పాలి. మంచి ఎమోషనల్‌ డ్రామా కూడా ఉంది. తెలుగులో 'గగనం" పేరుతో వస్తున్న ఈ చిత్రం తమిళంలో 'పయనం" పేరుతో రానున్నది. ఈ చిత్రంలో కత్తి లో చేసిన సనాఖాన్ ప్రయాణికుల్లా చేస్తోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.వి.గుహన్‌, కళ: కె.కబీర్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu