»   » కెరీర్లోనే ఇది రెండో సారి: నాగార్జున్ ఇస్తానన్న సర్‍‌ప్రైజ్ ఇదే.. (ఫోటోస్)

కెరీర్లోనే ఇది రెండో సారి: నాగార్జున్ ఇస్తానన్న సర్‍‌ప్రైజ్ ఇదే.. (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగార్జున ఈ నెల 23న అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. నాగార్జున ఇస్తున్న సర్ ప్రైజ్ ఏమిటో తెలిసిపోయింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న నిర్మలా కాన్వెంట్ మూవీలో నాగార్జున ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో నటించడంతో పాటు అభిమానులకు సర్ ప్రైజ్ చేస్తూ ఈ సినిమాలో ఓ పాట కూడా పాడుతున్నాడు నాగార్జున. శనివారం సాయంత్రం 6 గంటలకు ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ ఆ పాటను రిలీజ్ చేయబోతున్నారు.

గతంలో సితారామరాజు సినిమాలో నాగార్జున సిగరెట్ గురించి ఓ పాట పాడారు. ఇపుడు మళ్లీ ఇన్నాళ్ల తర్వాత 'నిర్మలా కాన్వెంట్'లో పాట పాడుతునప్నాడు. ఈచిత్రానికి కోటి తనయుడు రోషన్ సాలూరి సంగీతం అందిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ తనయుడు అమీన్ తో కలిసి నాగార్జున ఈ పాట పాడారు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు..

సినిమాకు హైలెట్

సినిమాకు హైలెట్

నాగార్జున గెస్ట్ రోల్, ఆయన పాడిన పాట సినిమాకు హైలెట్ అవుతుందని తెలుస్తోంది.

నిర్మలా కాన్వెంట్

నిర్మలా కాన్వెంట్

రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'నిర్మలా కాన్వెంట్‌'. ఈ చిత్రం ద్వారా జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయమవుతున్నారు. జై చిరంజీవ, దూకుడు, రోబో వంటి చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.

నటీనటులు

నటీనటులు

కింగ్‌ నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో రోషన్‌, శ్రేయా శర్మ హీరోహీరోయిన్లు కాగా ఆదిత్య మీనన్‌, సత్యకృష్ణ, సూర్య, అనితా చౌదరి, సమీర్‌, తాగుబోతు రమేష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

నాగర్జున ట్వీట్

సర్ ప్రైజ్ అంటూ నాగార్జున చేసిన ట్వీట్

English summary
According to Roshan Salur, Music Director of Nirmala Convent, “this craving of King Nag didn’t surprise me at all, he was at his best rendering the beautiful love song“.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu