»   » పెళ్ళి పీటలు ఎక్కుతున్న నగ్మా

పెళ్ళి పీటలు ఎక్కుతున్న నగ్మా

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన అందచందాలతో ఒకప్పుడు తెలుగు భాక్సాఫీస్ ని కుదిపేసిన నగ్మా ఆ తర్వాత క్రమంగా వేషాలు కరువై దూరమైపోయింది. భోజపురిలో సినిమాలు చేసుకుంటూ ఉన్న ఆమె వ్యాపారంలోకి, రాజకీయాల్లోకి దిగింది. ఇవన్నీ బోర్ కొట్టినట్లున్నాయి...దాంతో ఆమె దృష్టి పెళ్ళిపై పడింది. ఈ విషయాన్నీ ఈ విషయాన్ని స్వయంగా నగ్మానే మీడియాతో చెప్పుకొచ్చింది. ఆమె మాటల్లోనే...నా పెళ్లి ఈ సంవత్సరం జరుగుతుంది. అయితే నేను పెళ్ళాడబోయే వ్యక్తి ఎవరన్నది ఇంకా నిర్ణయంచు కోలేదు. మంచిగా, నిజాయితీగా ఉండే వ్యక్తినే పెళ్ళి చేసుకుంటాను అందామె. అయితే ఆమె సన్నిహితులు మాత్రం ఇప్పటికే నగ్మా మనస్సులో ఒకరున్నారు...అతనితోనే ఆమె పెళ్ళి అని చెప్తున్నారు. ఇక బాలీవుడ్‌ డైరెక్టరు దీపక్‌ శివదాసానితోను, భోజ్‌పురి హీరో రవికిషన్‌తోను, క్రికెటర్‌ సౌరబ్‌ గంగూలీతోనూ ప్రేమ వ్యవహారాలు నడిపినట్లు నగ్మామీద గతంలో వార్తలొచ్చాయి. ఆ విషయం ప్రస్తావిస్తే...సినీ పరిశ్రమలో వృత్తిపరంగా కొందరితో క్లోజ్‌గా వుంటూటాం. అంత మాత్రాన దానిని తప్పుగా అర్థం చేసుకోవలసిన అవసరం లేదు అంటూ అందరిలాగే ఖండించింది. ప్రస్తుతం నగ్మా కాంగ్రేస్ పార్టీలో జాతీయ రాజకీయాలలో బిజీగా ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu