For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎంతో మందితో అక్రమ సంబంధాలు.. నీ గురించి ఎవరికి తెలియదంటూ నగ్మపై ట్రోల్స్.. అసలు కథేంటంటే?

  |

  సుశాంత్ మరణంపై, దాని వెనుకున్న నిజాలను నిగ్గుతేల్చేందుకు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ చేస్తున్న పోరాటం గురించి అందరికీ తెలిసిందే. మొదటి నుంచీ నెపోటిజాన్ని వ్యతిరేకిస్తూ వస్తోన్న కంగనా.. తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ బాలీవుడ్ పెద్దలందర్నీ ఏకిపారేసింది. ఈ క్రమంలో కరణ్ జోహర్, ఆదిత్య చోప్రా, మహేష్ భట్ వంటి వారిపై తీవ్రంగా విరుచుకుపడింది. తాప్సీ, స్వర భాస్కర్ వంటి వారిని బీ గ్రేడ్ యాక్టర్స్ అని సంబోధించడం ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

  Recommended Video

  Actor Nagma Trolled By Netizens For Making Comments On Kangana Ranaut || Oneindia Telugu
  తాప్సీ కౌంటర్లు..

  తాప్సీ కౌంటర్లు..


  బీ గ్రేడ్ యాక్టర్స్ అని పిలవడంపై తాప్సీ, స్వర భాస్కర్‌లు కంగనాపై సెటైర్లు వేశారు. ఇందులో కొంత మంది నెటిజన్లు కంగనాకు మద్దతుగా నిలవగా.. మరికొంత మంది తాప్సీని సపోర్ట్ చేశారు. ఇలా వీరిద్దరి మధ్య యుద్దం జరుగుతూ ఉంది. తాజాగా నగ్మపై సోషల్ మీడియా ఓ రేంజ్‌లో విరుచుకపడుతోంది.

  కంగనాపై నగ్మ..

  కంగనాపై నగ్మ..

  నెపోటిజంపై కంగనా పోరాడుతూ ఉంటే.. దానిపై సెటైర్లు వేసేలా నగ్మ ఓ పోస్ట్ చేసింది. అసలు నెపోటిజం పునాదుల మీదే కంగనా వచ్చిందన్నట్టుగా ఓ మీమ్‌ను నగ్మ పోస్ట్ చేసింది. ఆదిత్య పంచోలి బాయ్ ఫ్రెండ్ అని ఆయన ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిందని, ఇమ్రాన్ హష్మీ చిత్రంలో ఫస్ట్ లీడ్ రోల్ చేసిందని, గ్యాంగ్ స్టర్ ఫస్ట్ చిత్రాన్ని మహేష్ భట్ నిర్మించాడని, హృతిక్ రోషన్ కైట్స్ చిత్రంతో రీలాంచ్ అయిందని, మళ్లీ క్రిష్ 3 చిత్రంతో మరోసారి ఛాన్స్ ఇచ్చారని తెలిపింది.

  గతంలో మాట్లాడలేదు..

  గతంలో మాట్లాడలేదు..

  కంగనా.. తన సోదరిని మేనేజర్‌గా పెట్టుకుందని అది నెపోటిజం కాదా? అని, సుశాంత్ మరణానికి ముందు ఎప్పుడూ కూడా అతని గురించి మాట్లాడలేదు సాయం కూడా చేయలేదని, కానీ సుశాంత్ పోయాక మాత్రం తన బెనిఫిట్ కోసం నచ్చని వారి మీద బురద జల్లుతోందని ఉన్న ఓ మీమ్‌‌ను నగ్మ పోస్ట్ చేసింది. అందులో కంగనా నెపోటిజం అని ట్వీట్ చేసింది.

   కంగనాపై ట్రోల్స్..

  కంగనాపై ట్రోల్స్..

  సుశాంత్ మరణంపై గానీ, సీబీఐ ఎంక్వైరీపై గానీ స్పందించని నగ్మ కంగనాపై సెటైర్లు వేయడంతో నెటిజన్లు భగ్గుమన్నారు. గతంలో ఆమె నడిపిన అక్రమ సంబంధాల చిట్టా బయటకు లాగారు. అండర్ వరల్డ్ డాన్లతో సంబంధాలున్నాయని, సౌరవ్ గంగూలీ, రవికిషన్, శరత్ కుమార్ వంటి వారితో అక్రమ సంబంధాలు నడిపావని, నీ గురించి ఎవరికీ తెలిదని ఓ రేంజ్ చెడామడా తిట్టేస్తున్నారు.

  స్పందించిన కంగనా టీమ్..

  స్పందించిన కంగనా టీమ్..

  నగ్మ చేసిన పోస్ట్‌పై కంగనా టీమ్ స్పందించి రిప్లై ఇచ్చింది. పంచోలి కంగనా బాయ్ ఫ్రెండ్ కాదు, ఆ విషయాన్ని ఎన్నో సార్లు చెప్పింది కూడా. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మెంటర్‌గా ఉంటానని చెప్పాడు కానీ టార్చర్ చేయడం, కొట్టడం వంటివి చేశాడని తెలిపింది. ఆమె స్వయంగా ఆడిషన్స్‌కు వెళ్లిందని, కంగనాను అనురాగ్ బసుకు ఎవ్వరూ పరిచయం చేయలేదని క్లారిటీ ఇచ్చారు.

   ఆడిషన్స్ వెళ్లి..

  ఆడిషన్స్ వెళ్లి..

  అనురాగ్ బసుకు కంగనా ఎవ్వరో కూడా తెలీదు. ఆ విషయాన్ని ఆయనే ఎన్నోసార్లు చెప్పాడు. గ్యాంగ్ స్టర్ సినిమాకు కంగనా ఆడిషన్స్ ఇచ్చింది. అది నెపోటిజం కాదు. కైట్స్ సినిమా వల్ల ఆమె కెరీర్ నాశనం అయింది. అందరూ బలవంతం చేయడం వల్లే క్రిష్ సినిమాలో నటించింది.

  సోదరిగా సాయం..

  సోదరిగా సాయం..

  పెళ్లి వేడుకల్లో డబ్బులు చల్లించుకోవడం, డ్యాన్సులు చేయడం వంటివి కంగనాకు నచ్చవు.. అందుకే ఏ ఏజెన్సీ కూడా ఆమెతో పని చేయడానికి ముందుకు రాలేదు. అందుకే రంగోలీయే కంగనా వ్యవహారాలు చూసుకుంటోంది. ఆమెకు కూడా బిజినెస్ నాలెడ్జ్ లేకపోయినా ఇంగ్లీష్ అంతగా రాకపోయినా ఎంతో కొంత ప్రయత్నం చేస్తోంది సోదరిగా సాయం చేస్తోంది. అంతే కాని అది నెపోటిజం కాదు. అబద్దాలు ప్రచారం చేయడం ఆపండ'ని క్లారిటీ ఇచ్చింది.

  English summary
  Nagma Is Trolled By Netizens For Comments On Kangana Ranaut. Nagma ji Pancholi wasn’t her BF, she has made it clear many times that initially he promised to mentor but soon turned tormentor, he used to beat her every time she went for auditions or film shoots no he didn’t introduce her to Anurag Basu..contd..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X