మెగాస్టార్ ఫ్యామిలీలో మరో ప్రేమ వివాహం, సీక్రెట్‌గా..
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో ప్రేమ వివాహం జరిగింది. అమితాబ్ బచ్చన్ సోదరుడైన అజితాబ్ బచ్చన్ కుమార్తె నైనా బచ్చన్, నటుడు కునాల్ కపూర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహం ఆడంబరాలకు దూరంగా, మీడియాకు తెలియకుండా రహస్యంగా జరిగింది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
కునాల్ కపూర్, నైనా బచ్చన్ గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఇద్దరూ కావాలనే సింపుల్ గా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కేవలం బంధుమిత్రుల సంక్షంలో ఫిబ్రవరి 9న వివాహం జరిగింది. కునాల్ కపూర్ ‘రంగ్ దే బసంతి' చిత్రం ద్వారా బాలీవుడ్లో సపోర్టింగ్ యాక్టర్ గా తెరంగ్రేటం చేసాడు. పలు చిత్రాల్లో నటించాడు.

Seychelles దేశంలోని ఓ ఐలాండ్ లో వీరి వివాహం జరిగింది. ఇక్కడే హనీమూన్ ఎంజాయ్ చేసి ఈ జంట తిరిగి ఇండియా తిరిగి వస్తారని తెలుస్తోంది. నైనా బచ్చన్ ప్రొషన్ విషయానికొస్తే ఆమె ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్. రెండేళ్ల క్రితం ఆమెకు కునాల్ కపూర్‌తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమగా మారి...ఆపై పెళ్లికి దారి తీసింది.


Click it and Unblock the Notifications











